న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ స్మారకార్థం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఈనెల 20న చెన్నైలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వార్షిక స్మారకోపన్యాసంతో కూడిన ఈ కార్యక్రమాన్ని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రారంభిస్తాడు. 1961-1975 మధ్యకాలంలో జాతీయ జట్టుకు ప్రతినిథ్యం వహించిన పటౌడీ 46 టెస్టులు ఆడి 2,793 పరుగులు సాధించాడు. ఒక టెస్టులో కెప్టెన్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అంతేగాక, భారత జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగానూ పటౌడీ రికార్డు నెలకొల్పాడు.
భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
english title:
c
Date:
Thursday, February 7, 2013