న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: మలేసియాలో వచ్చేనెల ఆరు నుంచి 17వ తేదీ వరకూ జరిగే 22వ అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ ఆటగాడు దనీష్ ముజ్‌తబా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హాకీ ఇండియా సెలక్టర్ సయ్యద్ అలీ, చీఫ్ కోచ్ మైఖేల్ నోబ్స్, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజిస్టు జాసన్ కొరాత్, ప్రభుత్వ పరిశీలకుడు హర్బీందర్ సింగ్ తదితరులు బుధవారం సమావేశమైన 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. ఏస్ డిఫెండర్ సందీప్ సింగ్‌కు ఈ జట్టులో స్థానం లభించకపోవడం గమనార్హం. అతనిని సెలక్టర్లు స్టాండ్ బైస్ జాబితాలో చేర్చారు.
జట్టు వివరాలు..
గోల్‌కీపర్లు: పిఆర్ శ్రీజేష్ (వైస్-కెప్టెన్), సుశాంత్ టిర్కీ.
ఫుల్‌బ్యాక్స్: రూపీందర్‌పాల్ సింగ్, హర్బీర్ సింగ్, గుర్జీందర్ సింగ్.
హాఫ్‌బ్యాక్స్: అమిత్ రోహిదాస్, గుర్మయిల్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్ కదంన్గమ్, ఎంబి అయ్యప్ప.
ఫార్వర్డ్స్: దనీష్ ముజ్‌తబా (కెప్టెన్), నితిన్ తిమ్మయ్య, సత్బీర్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాష్‌దీప్ సింగ్, చింగ్లెన్సానా సింగ్ కంగుజామ్, ధరమ్‌వీర్ సింగ్, గుర్వీందర్ సింగ్ చాందీ.
స్టాండ్‌బైస్: కేశవ్ దత్ (గోల్‌కీపర్), సందీప్ సింగ్ (డిఫెండర్), ప్రదీప్ మోర్ (మిడ్‌ఫీల్డర్), సురేందర్ కుమార్ (మిడ్‌ఫీల్డర్), మలాక్ సింగ్ (్ఫర్వర్డ్), ఇమ్రాన్ ఖాన్ (్ఫర్వర్డ్), అమోన్ మిర్సా టిర్కీ (్ఫర్వర్డ్), సిద్ధార్థ్ శంకర్ (్ఫర్వర్డ్).
అజ్లన్ షా హాకీ టోర్నీకి భారత కెప్టెన్‌గా దనీష్
english title:
c
Date:
Thursday, February 7, 2013