న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న భద్రతా సిబ్బంది విచారణకు నిలబడాలని మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ బుధవారం డిమాండ్ చేసింది. ఇలాంటి వారు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా)ను అడ్డుపెట్టుకుని విచారణ నుంచి తప్పించుకోవాలని చూడకూడదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ ప్రోగ్రాం డైరెక్టర్ సామ్ జారిఫి పేర్కొన్నారు. అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న భద్రతా సిబ్బంది అఫ్‌స్పాను ఆశ్రయిస్తున్నారని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వాగతించింది. చాలా కాలంగా భారత భద్రతా సిబ్బంది తాము పాల్పడిన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు అఫ్‌స్పాను కవచంగా వాడుకుంటున్నారని తెలిపింది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్
english title:
bhadrataa sibbandi
Date:
Thursday, February 9, 2012