బాగ్దాద్, ఫిబ్రవరి 8: ఇరాక్‌లో మంగళవారం ఒకే రోజు 14 మందిని ఉరితీశారు. వీరిలో అత్యధికులు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సభ్యులని న్యాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 68 మందిని ఉరి తీసినట్లు ఆయన తెలిపారు. వీరంతా 2006, 2007 సంవత్సరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర నేరాలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఇరాక్‌లో జనవరి 31న ఒకే రోజు 17మందిని ఉరితీసినట్లు న్యాయశాఖ మంత్రి హసన్ అల్ షమ్మారిని ఉటంకిస్తూ వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఈ సంఘట నపై ఐక్య రాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాక్‌లో మంగళవారం ఒకే రోజు 14 మందిని ఉరితీశారు.
english title:
iraq
Date:
Thursday, February 9, 2012