జైపూర్, ఫిబ్రవరి 12: మండలంలోని వేలాల రోడ్డును స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మంగళవారం పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాల మహాశివరాత్రి సందర్భంగా రోడ్డుకు మరమ్మతులు చేయించాలన్నారు. జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలోకి ఈ రోడ్డు ద్వారా ఇసుకను, 1 టిఎంసి నీటి తరలింపుకోసం ఈ రోడ్డు ద్వారా పెద్ద వాహనాలు నడవడం వలన రోడ్డు చెడిపోయిందన్నారు. మండలంలోని షెట్‌పల్లి, కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, శివ్వారం గల గ్రామాల వరకు సింగరేణి సంస్థ రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు. స్థానిక ప్లాంట్ జి ఎం బలరాం స్పందించి రోడ్డు మరమ్మతుల కోసం అధికారుల దృష్టికి తీసికెళ్ళి మరమ్మతులు చేయిస్తామన్నారు. అదేవిధంగా ముదిగుంట, పొన్నారం గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని జి ఎం తెలిపారు. నర్వా గ్రామానికి బి.టి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు బేతు తిరుపతి రెడ్డి, నాయకులు రిక్కుల శ్రీనివాస రెడ్డి, కట్కూరి సత్యనారాయణ, చల్ల విశ్వంబర్ రెడ్డి, సొల్లూరి కనకయ్యలు పాల్గొన్నారు.
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండి
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 12: రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని రెడ్ క్రాస్ సొసైటీ ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు, సబ్‌కలెక్టర్ బాలాజీ దిగంబర్ మంజూలే అన్నారు. రెడ్ క్రాస్ సోసైటీ అధ్వర్యంలో మంగళవారం స్థానిక శ్రీ లక్ష్మి నర్సింగ్ హోంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపద సమయంలో ఉన్న రోగుల ప్రాణాలకు కాపాడటానికి రక్తం దానం చేయాలని, అందుకు యువకులు ముందుకు రావాలని ఆయన కోరారు. సమాజంలో మార్పు తీసుకరావడానికి యువకులు అన్ని రంగాల్లో ముందుకురావాలని అన్నారు. అందరు కల్సిపనిచేస్తే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్దవహించాలని, విద్యా పరంగా, వికలాంగులకు, బాలకార్మికులకు అన్ని సేవలను అందించాలని, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని ఆయన కోరారు. అన్ని దానాల్లో కంటె రక్తదానం మిన్న అని, రక్తందానం గురించి అవగాహనసదస్సులను నిర్వహించాలని ఆయన కోరారు. సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మాట్లాడుతు కాగజ్‌నగర్‌లో బ్లడ్ స్టోరేజి యూనిట్‌ను నెలకొల్పడానికి తాము ప్రయత్నిస్తున్నామని, త్వరలో యూనిట్‌ను నెలకొల్పుతున్నామన్నారు. తాము ప్రజా సేవతో పాటుగా ప్రాణాలను కూడా కాపాడతామని, ఇప్పటి వరకు తమ అంబులెన్స్ ద్వారా 200 పైచిలుకు ప్రాణాలను కాపాడామన్నారు. కళాశాలల్లో కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆసిఫాబాద్ డివిజన్ కార్యదర్శి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ కె. అనిత, కాగజ్‌నగర్ తహశీల్దార్ మేకల మల్లేశ్, మున్సిపల్ కమిషనర్ సివి ఎన్ రాజులు ప్రసంగించారు. అనంతరం కాగజ్‌నగర్ పాత్రికేయుడుతో పాటుగా 60 మంది యువకులు రక్తదానం చేశారు.
మండలంలోని వేలాల రోడ్డును స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మంగళవారం పరీశీలించారు. ఈ సందర్భంగా
english title:
v
Date:
Tuesday, February 12, 2013