మంచిర్యాల, ఫిబ్రవరి 12: ఈ నెల 21న నిర్వహించే పట్ట్భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం లాంటివని టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం లేదని మండి పడ్డారు. ఎమ్మేల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవాలని లేకుంటే లగడపాటిలాంటి వారికి లోకువైతావని ఆయన హెచ్చరించారు. ఆంధ్ర ప్రాంతంలో సమైక్యవాదం కోసం తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఒక్కటయ్యారని తెలంగాణలో ఎందుకు ఒక్కటి కావడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్‌కు గాయాలైనా ఉద్యమాన్ని చక్కగా నడిపారని అలాంటి నాయకున్ని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని పట్ట్భద్రులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెరాస పట్టణ అధ్యక్షుడు కలువల జగన్‌మోహన్, మహిళ అధ్యక్షురాలు అత్తె సరోజ, విద్యార్థీ విభాగం తూర్పు జిల్లా అధ్యక్షుడు సోహెల్ ఖాన్ పాల్గొన్నారు.
కౌటాల సిఐపై ఆసిఫాబాద్‌లో కేసు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: కౌటాల సర్కిల్ ఇన్స్‌పెక్టర్ బి రవిపై ఆసిఫాబాద్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. సిర్పూర్-టి మండలం డోర్‌పల్లి గ్రామానికి చెందిన సప్నిల్‌గౌడ్ (27) అనే యువకుడు ఓ కేసులో సిఐ వేధింపులు భరించలేకే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గౌడ్ సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆసిఫాబాద్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది.
* టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల
english title:
a
Date:
Wednesday, February 13, 2013