ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను మేళవించే కెస్లాపూర్ నాగోబా జాతరకు మంగళవారం గిరిజనులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఆదివాసి గిరిజన తెగలకు చెందిన మెస్రం వంశస్తులు సంప్రదాయ రీతిలో నాగోబాకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి దర్బార్‌కు హాజరయ్యారు. గిరిజనులు అతి పెద్ద పండగగా భావించే కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ గిరిజన గూడెలా నుండి పిల్లాపాపలతో హాజరై అక్కడే భోజనాలు ఆరగించి పూజల్లో పాల్గొన్నారు. తమ సంస్కృతిని ఏ మాత్రం విస్మరించకుండా ఆచార వ్యవహారాలతో మత పెద్దలు పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర నుండి తరలి వచ్చిన గిరిజన వంశస్తులు హాజరై ‘్భటీ’ సందర్భంగా పరస్పరం కలుసుకొని పండగ జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ అశోక్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వివిధ సంఘాల నాయకులు, మెస్రం వంశస్తులు నాగోబాకు పూజలు నిర్వహించి ఈ సందర్భంగా క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. గిరిజన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా దర్భార్‌ను నిర్వీర్యం చేయడంపై పలువురు ఆగ్రహంవ్యక్తం చేశారు.
* కెస్లాపూర్ జాతరలో పోటెత్తిన గిరిజనం
english title:
n
Date:
Wednesday, February 13, 2013