కరీంనగర్, ఫిబ్రవరి 12: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్ట్భద్రుల శాసన మండలి నియోజక వర్గం ఎన్నికల ప్రవర్తన ని యమావళి ఉల్లంఘించినందుకు టిఆర్‌ఎస్ అభ్యర్థి స్వామి గౌడ్‌కు షోకాస్ నోటీస్ జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ తహశీల్దార్ నుండి అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆస్తులైన కలెక్టరేట్ ప్రహరి గోడపై, ట్రాఫిక్ పోలీస్ క్యాబిన్‌లపై కరపత్రాలు అంటించి ఎన్నికల ప్రవర్తనానియమావలి ఉల్లంఘించినట్లు తేలిందని అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ముద్రించు పోస్టర్లు, కరపత్రాలపై ప్రచురణ కర్త పేరు, చిరునామా, ప్రింటింగ్ ప్రెస్ యజమాని పేరు సెక్షన్ 127-ఎ ప్రకారం ముద్రించాలి, కరప్రతాలపై ప్రింటర్, పబ్లిషర్ అడ్రస్ లేకుండా ప్రభుత్వ ఆస్తులపై కరపత్రాలు అంటించినందుకు సెక్షన్ 127-ఎ ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష, రెండు వేల రూపాయల జరిమానా, లేదా రెండు శిక్షలు ఎందుకు విధించరాదో నోటీస్ అందిన మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాస్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు.
నియమావళి ఉల్లంఘించిన స్వామి గౌడ్‌కు నోటీస్ ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్
english title:
e
Date:
Wednesday, February 13, 2013