ఇస్లామాబాద్, ఫిబ్రవరి 8: బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌కు పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన పెషావర్‌లోని ఇంటిని పాకిస్తాన్ అధికారులు రూ. మూడు కోట్లకు కొనుగోలు చేసి, దాన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించారు. పెషావర్‌లోని ప్రసిద్ధి గాంచిన కిస్సా ఖ్వాని బజార్‌లో గల మొహల్లా ఖుదాదాద్ వద్ద గల ఇంట్లో 1922 డిసెంబర్ 11న దిలీప్ కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. పాకిస్తాన్‌లోని ఖైబర్-పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ సాంస్కృతిక శాఖ ఇటీవల ఈ ఇంటిని ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసిందని జియో న్యూస్ చానెల్ తెలిపింది.
ఆరు గదులున్న ఈ మూడంతస్థుల భవనాన్ని తిలకించడానికి త్వరలోనే సందర్శకులను అనుమతిస్తారని పేర్కొంది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం వరకు ఈ ఇంటిలో దిలీప్ కుమార్ బంధువులు నివసించేవారు.
ప్రకటించిన పాకిస్తాన్
english title:
dileep
Date:
Thursday, February 9, 2012