విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 13 : ఈనెల 21న జరగనున్న ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలక్టర్ పిఎ శోభ ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పోలింగ్ అధికారులు, సహాయాధికారుల శిక్షణా తరగతులను ఉద్దేశించి ఇన్‌చార్జి కలక్ట మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, పోలింగ్ అధికారులు, సహాయాధికారులకు పోలింగ్ బూతులు కేటాయించడం జరుగుతుందని, వీరంతా 20న ఎన్నికల సామగ్రితో పంపిణీ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్‌లో కౌంటర్ ఫాయిల్, బ్యాలెట్ పేపర్ మీద క్రమ సంఖ్య తేడా లేకుండా చూసుకోవాలన్నారు. ఈ ఎన్నికలకు జిల్లాలో 32 పోలింగ్ స్టేషన్లును ఏర్పాటు చేయడమైందని 40 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. 14 రూట్లుగాను, 11 జోన్లను ఏర్పాటు చేసి అందుకు అవసరమగు అధికారులను నియమించామన్నారు. పోలింగ్ ఏజెంట్లను సరైన అధికారిక అనుమతి పత్రంతోనే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. ఒక్కొ అభ్యర్ధి తరపున ఓట ఏజెంటును మాత్రమే అనుమతించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కంపార్టుమెంటును ఓటు ఎవరికి వేస్తున్నారో బయట పడని విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద బూత్ లెవెల్ అధికారి, విద్యుత్, బ్రాడ్‌బాండ్ తదితర రంగాల ప్రతినిధులతో కూడిన సాంకేతిక బృందం వుంటుందని, ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ బాధ్యతను సంబంధిత పోలింగ్ అధికారులు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని శోభ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమసుందర్, ఎన్నికల అధికారులు, సహాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని యువకుడి మృతి
విజయనగరం (కంటోనె్మంట్), ఫిబ్రవరి 13: పట్టణంలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. ఉడాకాలనీ ఫేజ్-2కి చెందిన దొడ్డ రామకృష్ణ (26) లారీ ఢీ కొన్న సంఘటనలో మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్ హెచ్.ఎం ఐడిసి సెంట్రల్ డ్రగ్ కార్యాలయంలో కాంట్రాక్టు అటెండర్ చేస్తున్న రామకృష్ణ తన ద్విచక్ర వాహనంపై అర్థరాత్రి ఎత్తుబ్రిడ్జి నుంచి ఆర్ అండ్ బి అతిథిగృహం వైపు వస్తుండగా ఎదురుగా రాయఘడ నుంచి విశాఖ వైపు వస్తున్న ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా ఢీ కొట్టడంతో రామకృష్ణ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు రామకృష్ణ తండ్రి రాము జిల్లా కేంద్రాసుపత్రిలో ఎఎంగా పనిచేస్తున్నాడు. మృతునికి తల్లి ఎరుకులమ్మతోపాటు ఇద్దరు అక్కచెళ్ళెల్లు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శంబర పోలమాంబ హుండీ లెక్కింపు
మక్కువ, ఫిబ్రవరి 13 : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శంబర పోలమాంబ హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం జరిగింది. ఈలెక్కింపు దేవాదాయశాఖ సిబ్బంది, పోలీసుల సమక్షంలో జరిగింది. ఈ ఆదాయం మొత్తం 3,23,425 రూపాయరాగా శీఘ్రదర్శనానికి 56,475 రూపాయాలు, ప్రత్యేక దర్శనానికి 40,090 రూపాయలు, కేశఖంఢనకు 26,050 రూపాయాలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో విదేశీనోట్లు కూడా ఉండటం గమనార్హం.
కూలీల హాజరులో
జిల్లాకు ప్రథమ స్థానం
సీతానగరం, ఫిబ్రవరి 13: ఉపాధి హమీ పనులకు ప్రతి రోజు హజరయ్యే కూలీల సంఖ్యలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని డుమా పి.డి ఆర్ శ్రీరాములు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో క్షేత్ర స్థాయి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకి దాదాపు 9లక్షల మంది కూలీలు వివిధ పనులకు హజరు అవుతున్నట్టు తెలిపారు. ఈ జిల్లాలో 2 లక్షల కూలీలు ప్రతి రోజు పనులను హజరు అవుతున్నట్టు తెలిపారు. 2012-13 సంవత్సరాలకు 800 కోట్ల రూపాయలతో పనులకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. డిమిస్టర్ విధానం ద్వారా పనులు మంజూరు చేసే విధానానికి కూలీలు అలవాటు పడుతున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి శనివారం తప్పని సరిగా అన్‌లైన్‌లో సెల్‌ఫోన్ ద్వారా కూలీలకు పనులు మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 22 వేల గ్రూపులు, 5.1 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.డి లక్ష్మణరావు, ఎ.పి.ఒ నాగలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి విద్యార్థుల ఆందోళన
విజయనగరం (కంటోనె్మంట్), ఫిబ్రవరి 13: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యలం పాలిటెక్నిక్, ఐటిఐ విద్యార్థులు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసి పాలిటెక్నిక్, ఐటిఐ వృత్తి విద్యాకోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో చేరారని తెలిపారు. ఆయా కళాశాల యాజమాన్యాలు, అధికారులు స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించదని చెప్పకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఫీజు చెల్లించలేక, అర్థంతరంగా చదువులు మానలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నార్థావేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిబిసిడబ్లు నాగేశ్వరరావ విద్యార్థి సంఘ నాయకులతో చర్చించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే చెల్లించాలని డిబిసిడబ్ల్యును విద్యార్థి సంఘ నాయకులు కోరడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావడంతో తామేని చేయలేని డిబిసిడబ్ల్యు చెప్పడంతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి గణేష్, వినోద్, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
చెరకు తరలింపులో జాప్యం.. రైతుల ఆందోళన
గజపతినగరం, ఫిబ్రవరి 13 : చెరకు పండిస్తున్న రైతులకు చేదే మిగులుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిట్టాయివలస, గంగచోళ్లపెంట, కొత్త శ్రీరంగరాజుపురం, పట్రువాడ, పురిటిపెంట తదితర గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో ఈ పంటను