Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

డిసిసిబి పీఠం కోసం తారస్థాయలో... ప్రతివ్యూహాలు!

$
0
0

మచిలీపట్నం, ఫిబ్రవరి 13: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసిబి) ఎన్నికకు వ్యూహ ప్రతివ్యూహాలు తారస్థాయికి చేరాయి. ఈ నెల 18న డిసిసిబి చైర్మన్ పదవి సహా పాలకవర్గానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మం త్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుతో పా టు డిసిఎంఎస్ చైర్మన్ కంచి రామారావు పోటీ పడుతున్నప్పటికీ అధిష్ఠా నం పిన్నమనేనికి అనుకూలంగా ఉన్న ట్లు సమాచారం. అలాగే టిడిపి నుంచి ముదినేపల్లికి చెందిన ఈడ్పుగంటి వెంకట్రామయ్య ఇప్పటికే బరిలోకి దిగి తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా టిడిపి నాయకులు ఈడ్పుగంటికి పూర్తి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ విషయానికొస్తే స్పష్టమైన విధానం ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థి విషయంలో ముందస్తు ప్రకటన వెలువడకపోవటంతో పార్టీలో కొంత గందరగోళం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మొత్తం జిల్లా మంత్రి పార్థసారథి భుజస్కంధాలపై నడుస్తోంది. పోటీలో ఉన్న నాయకులు ఇప్పటికే తమకు మద్దతు పలకాలని ఆయా పార్టీల నాయకులతో పాటు లోపాయకారీగా వేరే పార్టీల నాయకులను కూడా కలిసి అభ్యర్థిస్తున్నారు. పిన్నమనేనిపై పార్టీలోనే కొంత లోపాయికారీగా అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎడ మొహం పెడ మొహంగా ఉండే పిన్నమనేని, బూరగడ్డ కుటుంబాలు ఇటీవల మనస్పర్థలు పక్కనపెట్టి ఒకరికొకరు సహకరించుకునే విధంగా సమీకరణలు మారాయి. బూరగడ్డ వేదవ్యాస్ నివాసానికి పిన్నమనేని వెంకటేశ్వరరావు స్వయంగా వెళ్ళి మద్దతు కోరారు. బందరు నుండి ఇద్దరు, పెడన నియోజకవర్గం నుంచి ఏడుగురు సంఘ అధ్యక్షులు పిన్నమనేనికి మద్దతు పలికేవిధంగా వేదవ్యాస్ హామీ ఇచ్చారు. 18లోపు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదిలావుంటే బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) కూడా గణనీయమైన సంఖ్యలో అభ్యర్థులను గెలిపించుకున్నారు. 11మంది వరకు నాని చేతిలో ఉన్నారు. వీరి మద్దతు కూడా కీలకం కానుంది. వైఎస్‌ఆర్‌సిపి నుంచి అభ్యర్థి పోటీలో ఉండే విషయం ఇప్పటికీ సందేహంగానే ఉంది. వసంత నాగేశ్వరరావు పోటీ చేయదలచుకున్న ఐతవరం సొసైటీ ఎన్నికపై స్టే విషయం ఎటూ తేలకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. వసంత కాకుంటే వేరే అభ్యర్థి పోటీ చేసే పరిస్థితులు కనిపించటం లేదు. ఆఖరి నిమిషయంలో ఎవరినైనా పోటీకి పెట్టినా నామ్‌కే వాస్తేలా ఉంటుందేతప్ప గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించటం లేదు. మరోవైపు కొందరు సంఘ అధ్యక్షులు ఆయా పార్టీల శిబిరాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. పెళ్ళిళ్ల సీజన్ కావటంతో తాత్కాలికంగా శిబిరాలకు బ్రేక్ పడినట్లు తెలిసింది. 18న జరగనున్న డిసిసిబి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరోజు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. శుక్రవారం డిసిసిబి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరుగుతుంది. మొత్తం 21మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 16మంది పిఎసిఎస్‌ల నుంచి ఎన్నిక కానుండగా మిగిలిన ఐదుగురు మత్స్య, చేనేత, గొర్రెలు తదితర సంఘాల నుంచి ఎన్నికవుతారు. మొత్తం 406 సొసైటీలకు గాను డిసిసిబికి బకాయిలు ఉండటంతో 46 సొసైటీలు ఓటింగులో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. 13సొసైటీలు బకాయిలను చెల్లించి ఓటు హక్కుకు అర్హత పొందాయి.

వైభవంగా స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు
వీరులపాడు, ఫిబ్రవరి 13: విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠలకు వేలాదిగా తరలివచ్చిన జన ప్రవాహంతో మండలంలోని అల్లూరు గ్రామం తిరునాళ్లను తలపించింది. గ్రామానికి చెందిన అగ్రి గోల్డ్ వ్యవస్థాపకుడు అవ్వా హేమసుందర వరప్రసాద్, అల్లూరి భాస్కరరావు, గ్రామస్థుల సహకారంతో శిథిలావస్థలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నూతన దేవాలయాన్ని నిర్మించి బుధవారం సీతారామచంద్రస్వామి, మహాలక్ష్మీదేవి విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు హాజరయ్యారు. 30వేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా గ్రామ భక్త కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కరెంటు కోత మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ నర్శింహరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

వేదాలతో పులకిస్తున్న
జాతి మనది: మండలి
అవనిగడ్డ, ఫిబ్రవరి 13: వేదాలతో భారత జాతి పులకిస్తుందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక శ్రీ సీతారామ వేదశాస్త్ర పరిషత్‌లో రూ.49లక్షలతో చేపట్టిన మందిర పునర్నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి ప్రసంగించారు. వేదాలు ఏ ఒక్కరి సొత్తూ కాదని, వాటి పరిరక్షణకు ఇటువంటి భవన నిర్మాణాలు మరిన్ని జరగాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. వేదాలను విమర్శించడం కాకుండా వాటిలోని సారాన్ని గ్రహించడం మన ధ్యేయం కావాలన్నారు. ఈ తరహా నిర్మాణాలకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని బుద్ధప్రసాద్ చెప్పారు. విష్ణ్భుట్ల సూర్యనారాయణ అధ్యక్షత వహించన ఈ సభలో ఎఎస్ శాస్ర్తీ, విశ్వనాథ సుబ్రహ్మణ్య అవధాని, పి నారాయణమూర్తి, చిట్టి చంద్రశేఖర్, పి ఫణికుమార్, పి శ్యాంసుందర కుమార్, తదితరులు ప్రసంగించారు. అనంతరం బుద్ధప్రసాద్‌ను బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

అన్నా.. అన్నా అంటూనే
దెబ్బతీశావు కదయ్యా..!
* మంత్రి సారథి వద్ద వసంత ఆక్రోశం
కంచికచర్ల, ఫిబ్రవరి 13: ‘అన్నా... అన్నా.. అంటూనే ఐతవరం సొసైటీ ఎన్నికలు జరగకుండా స్టే తెచ్చి నన్ను మరోసారి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నిక కాకుం డా చేశావుకదయ్యా సారథీ’.. అని డిసిసిబి మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు మంత్రి వద్ద తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ గుదె రంగారావు ఇంట్లో బుధవారం జరిగిన కార్యక్రమానికి తొలుత వసంత నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయన భోజనం చేస్తుండగా రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి వచ్చారు. భోజనం చేస్తున్న వసంత వద్దకు చేరుకున్న సారథి ‘అన్నా బాగున్నావా’ అంటూ పలకరించారు. ఈసందర్భంగా ఇద్దరి మధ్య జిల్లా సహకార బ్యాంకు ఎన్నిక ప్రస్తావనకు వచ్చి ఆసక్తికర చర్చ జరిగింది. ‘అన్నా.. అన్నా.. అంటూనే స్టే తీసుకువచ్చి నాకు వెన్నుపోటు పొడిచావుగా.. ఐతవరం సొసైటీకి స్టే తీసుకురావడంలో నీ పాత్ర ఉందని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు నాతో ఫోన్‌లో అన్నాడు.. ఏమయ్యా సారథీ! నేను నీకు ఏమి అన్యాయం చేశాను? ఇది నీకు తగునా’.. అంటూ వసంత వాపోయారు. దీంతో కంగుతిన్న సారథి ‘అన్నా నేనయితే వెన్నుపోటు పొడవలేదు.. స్టే తీసుకురావడంలో నా ప్రమేయం లేదు.. పిన్నమనేని నాపై అలా ఆరోపణ చేసి ఉండవచ్చు’.. అంటూ మంత్రి సారథి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వసంత ‘పిన్నమనేని చెప్పిన దానిలో వాస్తవం ఉందంటూ తినే భోజనం పట్టుకొని ప్రమాణం చేస్తాను.. దానికి నీవు సిద్ధమేనా?’ అని మంత్రితో అన్నారు. దీంతో ఏమి మాట్లాడాలో తెలియక మంత్రి సారథి నవ్వుతూ ‘స్టే తీసుకొచ్చే విషయంలో మొదటి ప్రతిపాదన చేసింది నేను కాదు.. తరువాత విషయాలు మామూలే కదా.. కోర్టు వరకూ వెళ్లేసరికి ఈవిషయంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది’.. అని పరోక్షంగా అంగీకరించారు. ‘రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కదా!’ అంటూ తప్పించుకోజూశారు. ఈ ఆసక్తికర సంభాషణ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న సమయంలో వారి అనుచరులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వారు కూడా నవ్వుకున్నారు.

ప్రైవేట్ కళాశాలకు
అనుమతి ఇవ్వొద్దని ర్యాలీ
పెడన, ఫిబ్రవరి 13: పట్టణంలో మరో ప్రైవేట్ జూనియర్ కళాశాలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని స్థానిక బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాల విద్యార్థులు, వ్యవస్థాపక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలకు సమీపంలోనే మరో ప్రైవేటు కళాశాలకు ప్రభుత్వం అనుమతిస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం విద్యార్థులు, వ్యవస్థాపక కమిటీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కళాశాల దగ్గర నుండి బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిటీ సభ్యులు బొడ్డు సుబ్బారాయుడు, బొడ్డు వేణుగోపాలరావు, కొల్లూరి శ్రీకిషోర్, చందన నారాయణరావు మాట్లాడారు. పట్టణంలో ఇప్పటికే కొనసాగుతున్న జూనియర్ కళాశాలకు అతి సమీపంలో మరో కళాశాలకు అనుమతి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వాస్తవ దృష్టితో ఆలోచించి ప్రభుత్వాధికారులు మరో కాలేజీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డు ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉద్దేశపూర్వకంగా...
పైప్‌లైన్ ధ్వంసం చేస్తే యావజ్జీవ శిక్షార్హులు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 13: ఖనిజ, ఇంధన పైప్‌లైన్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తే యావజ్జీవ శిక్షార్హులని ఎస్పీ జె ప్రభాకరరావు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా హెచ్‌పిడిసిఎల్ మేనేజర్ ఎం సేవ్యం విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు ఏర్పాటు చేయనున్న ఖనిజ ఇంధన పైపుమార్గం నిర్మాణం గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రధానంగా హెచ్‌పిడిఎల్ వారు విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు ఏర్పాటు చేయనున్న ఖనిజ, ఇంధన పైపుమార్గం నిర్మాణం గురించి వివరించారు. ఈ ప్రతిపాదిత పైప్‌లైన్ విశాఖపట్నం నుండి 1998లో విజయవాడ వరకూ నిర్మాణ కార్యక్రమాలను ముగించుకుని ప్రస్తుతం సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే విశాఖ నుండి జంట నగరాల వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా నిరంతరం అన్ని రకాల ఖనిజ, ఇంధన సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ పైపులైన్ నిర్మాణం భూఉపరితలానికి ఒక మీటరు లోతులో అత్యంత అధునాతన భద్రతా ప్రమాణాలతో జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లాలో చాట్రాయి, విస్సన్నపేట, రెడ్డిగూడెం, ఎ కొండూరు, మైలవరం, జి కొండూరు, వీరులపాడు, నందిగామ, పెనుగించిప్రోలు, జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల నుండి వెళుతుందన్నారు. ఈ నిర్మాణం విశాఖ నుండి జంటనగరాల వరకు 572 కిలోమీటర్లు సాగుతుందని వివరించారు. పైప్‌లైన్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం 18మీటర్ల నిడివిలో పంటపొలాల్లో తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిప

* నేడు నోటిఫికేషన్ * వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి రంగంలో లేనట్టే * పిన్నమనేని వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు?
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>