నెల్లూరు, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (ఎన్‌డిసిసిబి), జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డిసిఎంఎస్) డైరెక్టర్ పదవులకు నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్‌డిసిసిబిలో మొత్తం 21 డైరెక్టర్ పదవులకుగాను రెండు కేటగిరిలు (ఏ కేటగిరిలో 16, బి కేటగిరిలో ఐదు డైరెక్టర్లు) ఉన్నాయి. ఏ కేటగిరిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. బి కేటగిరిలో వివిధ చేతి వృత్తి సహకార సంఘాల ప్రతినిధులు డైరెక్టర్లయ్యే అవకాశం కల్పించారు. ఇందుకుగాను ఏ కేటగిరిలో ఓసిలకు 12, మూడు ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి రిజర్వేషన్ అమలులో ఉంది. అయితే జిల్లాలో ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కరూ కూడా సహకార సంఘ అధ్యక్షులు కాకపోవడంతో రిజర్వేషన్ ఆచరణకు నోచుకోవడం లేదు. ఓసిలకు చెందిన 12 డైరెక్టర్లకు 12 మంది మాత్రమే నామినేషన్లు వేయడంతో సహా స్క్రూటినీలో కూడా ఆమోద ముద్ర పొందడంతో వారే పదవులకు ఎంపిక కానున్నారు. కాగా, వీరంతా కాంగ్రెస్ మద్దతుదారులు. ఇదిలాఉంటే ఏ కేటగిరిలోని ఎస్సీ, ఎస్టీల డైరెక్టర్లను పాలకవర్గం మెజారిటీ మొగ్గు చూపుతూ కో ఆప్ట్ చేసుకునేలా నిబంధనలు అనుకూలిస్తున్నాయి. ఏ కేటగిరిలో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఎన్‌డిసిసిబి అధ్యక్షునిగా ప్రచారంలో ఉన్న మెటుకూరు ధనుంజయరెడ్డి (అనంతసాగరం సొసైటీ), కోడూరు కమలాకరెడ్డి (కోడూరుపాడు), ఏటూరు శివరామకృష్ణమూర్తి (బుచ్చిరెడ్డిపాళెం), కె వెంకట సుబ్బారెడ్డి (కురుగొండ్ల), మహదేవరెడ్డి (నాయుడుపేట), ఎన్ జగన్మోహనరెడ్డి (ఊనుగుంటపాళెం), ఎర్రం కృష్ణయ్య (గరిమెనపెంట), రామిశెట్టి సుధాకర్‌నాయుడు (కావలి), దొడ్ల శ్రీనివాసులురెడ్డి (అల్లూరు పశ్చిమ), కె మోహనరావు(సైదాపురం), వి రమణారెడ్డి (జయంపు), చిట్టమూరు వెంకట శేషారెడ్డి (మనుబోలు సొసైటీల) నుంచి అధ్యక్షులున్నారు. డిసిసిబికి సంబంధించి బి కేటగిరిలో ఐదు డైరెక్టర్లకుగాను నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో మత్స్యకార సొసైటీకి సంబంధించిన కె వెంకటసుబ్బయ్య అనే అభ్యర్థి నామినేషన్ పరిశీలనలో తొలగించినట్లు జిల్లా సహకార అధికారి సుబ్బారావువెల్లడించారు. బి కేటగిరిలో ఆమోదానికి నోచుకున్న నామినేషన్లలో కల్లుగీత కార్మిక సంఘం నుంచి బుర్రా వెంకటేశ్వర్లుగౌడ్, కాటా రమణయ్య, చేనేత సహకార సంఘం నుంచి శ్రీనివాసరావుఉన్నారు. డిసిఎంఎస్‌కు సంబంధించి ఏ కేటగిరిలో ఆరు డైరెక్టర్లు, బి కేటగిరిలో నాలుగు డైరెక్టర్లున్నాయి. అందులో ఏ కేటగిరిలో మూడు ఓసి, బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కోటి వంతున రిజర్వేషన్ అమలులో ఉంది. ఏ కేటగిరిలో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో డిసిఎంఎస్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న విడవలూరు మండలం వరిణి సొసైటీ అధ్యక్షుడు సుమంత్‌రెడ్డి, అలాగే వెంకురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సుధీర్‌నాయుడు నామినేషన్లు వేశారు. అదేవిధంగా బి కేటగిరిలో కె శ్రీ్ధర్, కొరటాల సుప్రజ నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నామినేషన్లు స్క్రూటినీలో ఆమోదానికి నోచుకున్నాయి.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (ఎన్‌డిసిసిబి), జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డిసిఎంఎస్) డైరెక్టర్
english title:
director
Date:
Saturday, February 16, 2013