Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సిపిఎం, కాంగ్రెస్ మధ్య అవగాహన...?

$
0
0

ఖమ్మం, ఫిబ్రవరి 17: డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకున్న సిపిఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు వరంగల్ జిల్లా దంతాలపల్లిలో ఇరు పార్టీల నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో 23చోట్ల కాంగ్రెస్, 12చోట్ల సిపిఎం అధ్యక్ష స్థానాలను గెలుచుకుంది. ముందుగా తెలుగుదేశంతో ఒప్పందానికి కుదుర్చుకునేందుకు ప్రయత్నించిన సిపిఎం చర్చలు విఫలం కావటంతో కాంగ్రెస్ సిపిఎం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అవసరమైతే డిసిసిబి అధ్యక్ష స్థానాన్ని అప్పగించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నది. అయితే వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులుగా గెలిచిన 13మంది తాము ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించటంతో 47మంది గెలిచిన తెలుగుదేశం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాకుండా తెలుగుదేశంకు నలుగురు సభ్యులు కలిగిన సిపిఐ కూడా మద్దతునిస్తుంది. అయితే తెలుగుదేశం శిబిరంలోనే అనేక మందితో కాంగ్రెస్ నాయకులు ఫోన్ ద్వారా సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయాల్లో టిడిపి సభ్యులు కొందరు తమకు ఓటు వేస్తారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వైఎస్‌ఆర్‌సిపిలోని కొద్దిమందినైనా పోలింగ్‌కు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్, సిపిఎం నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

టిడిపి శిబిరాన్ని సందర్శించిన సిపిఐ నేతలు
ఖమ్మం, ఫిబ్రవరి 17: పశ్చిమ గోదావరి జిల్లా పట్వాయిగూడెంలో ఉన్న టిడిపి శిబిరాన్ని ఆదివారం సిపిఐ నేతలు సందర్శించారు. సహకార సంఘాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన తెలుగుదేశం, సిపిఐకి చెందిన 51మంది సభ్యులు ఈ శిబిరంలో ఆదివారం ఉన్నారు. వీరంతా సోమవారం నేరుగా డిసిసిబి కార్యాలయానికి చేరుకొని ఓటు వేయనున్నారు. సిపిఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సిద్ధి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సాబీర్‌పాషాలు ఆదివారం పట్వాయిగూడెంలో సహకార సంఘాల అధ్యక్షులకు నిర్వహించిన మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని, బాగంలు మాట్లాడుతూ డిసిసిబి, డిసిఎంఎస్‌లలో టిడిపి, సిపిఐ కూటమిదే విజయమన్నారు. తమ శిబిరంలో 51మంది సభ్యులు ఉన్నారని, వారంతా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను కూడా తమ కూటమి గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.

తడిసి ముద్దయిన మిర్చి
ఖమ్మం , ఫిబ్రవరి 17: గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి మండలంలోని కల్లాల్లో ఆరబోసిన మిర్చీ తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమన్నారు. ఆరుగాలం కష్టించి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చీ పంట చేతికందే సమయంలో అకాల వర్షం ఊడ్చిపెట్టుకుపోయిందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం కురిసిన వర్షంతో నష్టం పెద్దగా వాటిల్లనప్పటికీ, అదేరోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాలలో పట్టాలు కప్పివున్న మిర్చీ కుప్పలన్నీ వర్షపునీటితో తడిసి ముద్దయ్యాయి. దీంతో మండలంలోని బారుగూడెం, చింతపల్లి, కొండాపురం, ఎంవిపాలెం, కస్నాతండా, కాచిరాజుగూడెం, మంగళగూడెం, గుదిమళ్ళ, వెంకటగిరి, కైకొండాయిగూడెం, తల్లంపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు రాత్రి కురిసిన వర్షానికి కల్లాలలో ఉన్న మిర్చీ కుప్పల చుట్టూ నీరు చేరిన దృశ్యాన్ని చూసి నిశే్చష్టులయ్యారు. ప్రభుత్వం తడిసిన మిర్చీని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఇదిలావుండగా అకాలంగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలకు ఊరటనిచ్చాయి. వ్యవసాయ బావులలో భూగర్భజలం పుష్కలంగా ఉన్నప్పటికీ, కరెంట్ కోత కారణంగా ఆనీటిని పంటలకు పెట్టలేని దుస్థితి నెలకొంది. ఎకరం భూమి తడి తిరగాలంటే నాలుగైదు రోజులు పడుతుందంటే అతిశయోక్తేమీ కాదు. ఒకవైపు నుంచి నీరు పెడుతూ వస్తుంటే మరోవైపున పంట వడలిపోతున్న తరుణమిది. ఈతరుణంలో ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, ఆకు కూరలు, కూరగాయ తోటలు, వ్యవసాయ బావుల కింద సాగు చేసిన రబీ వరి పంటలకు ఎంతో ఉపకరించాయి. మొత్తమీద ఈ అకాల వర్షాలు ఆరు తడి పంటలు సాగు చేసిన రైతులకు మోదాన్ని, మిర్చీ రైతులకు ఖేధాన్ని మిగిల్చాయి.
ఏజెన్సీలో రూ. 8కోట్ల పంట నష్టం
చర్ల: భద్రాచలం ఏజెన్సీలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పడిన భారీ వర్షానికి రూ.8కోట్ల మేర మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. అలాగే మొక్కజొన్న పంటకు సైతం దాదాపుగా రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఆయా మండలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 3సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే రైతులు చర్ల మండలంలో 3వేల ఎకరాలు, వెంకటాపురం మండలంలో 3800 ఎకరాలు, వాజేడులో 2వేల ఎకరాలకు పైగా మిర్చి పంటను సాగు చేశారు. ఒక్కో ఎకరం నుంచి 8-10 క్వింటాళ్ల వరకు మిర్చిని కోసి ఆరబెట్టిన తరుణంలో కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. అలాగే భారీ వర్షానికి మిర్చి చెట్లు నేలకొరిగిపోగా, మరికొన్ని విరిగిపోయాయి. దీంతో మిర్చి రైతులు భారీగా నష్టపోయారు. ఈ తరుణంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు.

విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఖమ్మం, ఫిబ్రవరి 17: విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని ఎపిటిఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బద్ధం అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీకి ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనుండగా ఆదివారం ప్రచారం నిర్వహించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఎపిటిఎఫ్ సంఘానే్న స్థాపించామని, సమస్యల పరిష్కారమే తమ మొదటి ఎజెండా అన్నారు. అనునిత్యం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్టస్థ్రాయిల్లో తాము చేసిన ఆందోళనలను ఉపాధ్యాయులు గుర్తిస్తున్నారన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో నేడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో సైతం తమ సంఘం ముందున్నదనే విషయాన్ని గుర్తు చేశారు. విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంలో అందరి సహకారం తీసుకున్నామని స్పష్టం చేశారు. విద్యా ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను వ్యతిరేకించాలని, ఉమ్మడి ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యమ వేదికను ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆ దిశగా తాను ముందుంటానని స్పష్టం చేశారు. ప్రజాతంత్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు అందరి సహకారం తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయవృత్తి సమస్యలను శాసనమండలి వేదికగా పరిష్కరించేందుకు కృషి చేయటంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులను పునరంకితం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర : సూర్యాపేటలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేయటంతో పాటు ఉపాధ్యాయ మాసపత్రికకు ఏడిటర్‌గానూ, తెలంగాణ జెఏసి కో చైర్మన్‌గా పని చేస్తున్న అశోక్‌రెడ్డి కుటుంబమంతా తెలంగాణ సాయుధపోరాటంలో కీలకపాత్ర పోషించింది. ఆయన తాత తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించగా, నేటికీ ఆ కుటుంబం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నది. గత 65ఏళ్ళుగా వెలువడుతున్న ఉపాధ్యాయ మాసపత్రికకు ఏడిటర్‌గానూ, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా ఆయన పని చేస్తున్నారు. ఎపిటిఎఫ్ రాష్ట్ర నాయకుడిగా బాధ్యతల్లో ఉన్నారు. ఉపాధ్యాయ సమస్యల కోసం తమ సంఘం చేపడుతున్న ఉద్యమాలను తెలియచేస్తూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వృత్తి, ఎయిడెడ్ పాఠశాలల, కళాశాలల అధ్యాపకబృందం ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించటం విశేషం. కొన్ని సంఘాలు నేరుగా ద్వితీయ ప్రాధాన్యత ఓటును ఆయనకే వేయాలని ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.

డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని
english title: 
understanding

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>