ఆలూరు, ఫిబ్రవరి 17: రైల్వే బడ్జెట్లో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకు ప్రాధాన్యత ఇస్తానని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆలూరుకు విచ్చేసిన ఆయన ఆర్ అండ్ బి అతిధిగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కర్నూలు - మంత్రాలయం రైల్వేలైన్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. డీజిల్, పెట్రో ల్ ధరలు పెరిగినందున ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా తక్కు వ మొత్తంలో రైల్వే చార్జీలను పెంచనున్నామన్నారు. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి హాయాంలో జిల్లాలో సాగు - తాగు నీటి పథకాలకు అత్యధికంగా నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎల్లెల్సీకి మన రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాకై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని రైల్వే సహాయ మంత్రి తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుండయ్యలు పాల్గొన్నారు.
* మంత్రి కోట్ల
english title:
kotla
Date:
Monday, February 18, 2013