కర్నూలు, ఫిబ్రవరి 17: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం తాగునీటి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపి నిధులతో చేపట్టిన తాగునీటి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపోతే ఈ ఏడాది వర్షభావ పరిస్థితుల వల్ల సిఆర్‌ఎఫ్ కింద విడుదలైన నిధులను తాగునీటి పనుల కోసం ఉపయోగించాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు తమ పరిధిలోని గ్రామ, మండలాలను సందర్శిస్తూ పత్రికల్లో గాని, తాగునీటి సమస్య పరిష్కరించాలని దరఖాస్తులుగానీ అందితే తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకోవడమేగాక, ప్రతి రోజూ రెగ్యులర్‌గా తమకు నివేదిక పంపాలని ఆర్డీఓలను ఆదేశించారు. నగరానికి 45 రోజులకు సరిపడా నీరు సమ్మర్ స్టోరేజి ట్యాంకులో ఉన్నాయని, సుంకేసులలో 0.9 టిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు. 8 మున్సిపాలిటీలలో కూడా 45 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు సంమృద్ధిగా ఉన్నాయని, జూలై వరకూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. వచ్చే వారం నుంచి జిల్లా వ్యాప్తంగా పర్యటించి సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల్లో నీటి నిల్వలను పరిశీలిస్తామని, ఇంకా అవసరమైతే ట్యాంకుల్లో నీటిని నింపడానికి సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తామన్నారు. వేసవికాలం ప్రారంభమైనందున సీజన్ ముగిసే వరకూ ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇలు ప్రజల నుంచి తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా డిఇ, ఎఇలను స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా కోసం ముందుకు వచ్చే దాతల సహకారంతో గ్రామాలకు నీరు సరఫరా చేయాలని, పత్రికల్లో వచ్చిన వార్తలకు అధికారులు రీజాండర్స్ తప్పక పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రవిబాబు, జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, జిల్లా పంచాయతీ అధికారిణి శోభస్వరూపరాణి, కర్నూలు, ఆదోని ఆర్డీఓలు ఓబులేసు, రాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
english title:
drinking water problem
Date:
Monday, February 18, 2013