Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

రైతులు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు..

కల్లూరు, ఫిబ్రవరి 17: రైతులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారనడానికి సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల విజయమే నిదర్శనమని ఎమ్మెల్సీ సుధాకర్ బాబు పేర్కొన్నారు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా పోటీ పడాలనుకోవడం అవివేకం అని, కాంగ్రెస్‌తో పెట్టుకుంటే చావుదెబ్బ తినడం ఖాయమని సహకార ఎన్నికల్లో రుజువైందన్నారు. ఇక పోతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్, విజయమ్మ, షర్మిల దొంగలు అని తేలడంతో రైతులు సహకార ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. లక్షల ఎకరాలను దోచుకున్న బ్రదర్ అనిల్‌కుమార్ ఆ భూములను ఎవ్వరికి ఇచ్చారో ప్రజలకు సమాధానం చెపాల్సి వుందన్నారు. సహకార ఎన్నికల్లో చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అర్హత లేకపోయినప్పటికీ వైకా పా పోటీ చేసి డబ్బుతో గాలం వేయాలని చూస్తుందన్నారు. ఏ పార్టీ అయినా బలం లేదని తెలిసి కూడా పోటీకి రావడం హాస్యాస్పదంగా వుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై రైతులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కెడిసిసి ద్వారా రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. సమావేశంలో నగర మాజీ మేయర్, డిసిసి అధ్యక్షులు రఘురామిరెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డి, సలాం, తిప్పన్న, చున్నుమియా తదితరులు పాల్గొన్నారు.

* ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు
english title: 
supporting congress

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>