శ్రీశైలం, ఫిబ్రవరి 17: చెన్నై నగరంలో హిందూ స్పిరిచువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్ వారి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన శ్రీశైలం దేవస్థాన ధర్మ ప్రచార రథానికి ఆదివారం ఇఓ సాగర్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథం పరిపాలన, అర్చక సిబ్బందితో కలిసి చెన్నైకు బయల్దేరింది. రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ధర్మ ప్రచార రథం పంపినట్లు వారు తెలిపారు.
మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలం, ఫిబ్రవరి 17: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారం దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు కార్యనిర్వాహక సిబ్బంది, సిఐ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ముందుగా ఉచిత క్యూలైన్ల పనులను పరిశీలించారు. శివదీక్ష భక్తుల కోసం గత సంవత్సరం మాదిరిగానే ఆలయ ఉత్తర భాగం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అతిశీఘ్ర క్యూలైన్లను కళా మందిరం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇఓ సాగర్‌బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారి వెంట ఇంజినీరింగ్ అధికారి రమేష్, సిఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ నాగేశ్వరరావు, విఆర్‌ఓ అనీల్‌కుమార్ తదితరులు వున్నారు.