అవుకు, ఫిబ్రవరి 17: కడప జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అవుకు రిజర్వాయర్‌కు చేరుకుంటున్న నీరు చాలా తక్కువ క్యూసెక్కుల్లో వుండడంతో ఇరిగేషన్ అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశా రు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 219 లెవెల్‌కు నీటి నిల్వ వుంది. ఆదివారం సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటరమణ నీటి విడుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపకు నీటిని తరలించేందుకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. అయితే ఈ నెల 10న అవుకు రిజర్వాయర్‌కు చేరిన నీరు 100 క్యూసెక్కులు కాగా 11న 240, 12న 100, 13న 60, 14న 40, 15న 300, 16న 393, 17న 270 క్యూసెక్కుల నీరు అవుకు రిజర్వాయర్‌కు చేరిందని వెల్లడించారు. ఈ స్థాయిలో నీటి సరఫరా జరిగితే కడప జిల్లా మైలవరం డ్యాంకు నీరు చేరడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ వద్దకు నీరు చేరే లోపే నీటి సరఫరా శాతం పూర్తిగా పడిపోయిందన్నారు. విడుదలవుతున్న నీరు ఎక్కడికి వెళ్తున్నదీ విచారించనున్నట్లు తెలిపా రు. ప్రస్తుత పరిస్థితిని రెండు జిల్లాలకు సంబంధించిన ఉన్న త స్థాయి అధికారులకు నివేదించామన్నారు. అవుకు రిజర్వాయర్ నుంచి ఎస్‌ఆర్‌బిసి పంట కాలువలకు నీటి విడుదల నిలిపి వేయాలని ఆదేశించా రు. ఎస్‌ఆర్‌బిసి పంట కాలువలకు ఈ నెల 15 వరకూ నీరు అందిస్తామని హా మీ ఇచ్చామని ఆ మేరకు నీరు విడుదల చేశామని తెలిపారు. ఇక మీదట రిజర్వాయర్ నుంచి ఎస్‌ఆర్‌బిసికి నీరు ఇచ్చే అవకాశం లేదని తెలిపారు. కడప జిల్లా దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితం ఇచ్చే అవకాశం లేదని అధికారులే తేల్చి చెబుతుండడం గమనార్హం. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ రిజర్వాయర్‌కు చేరే నీరు సుమారు 700 క్యూసెక్కుల నీరు వుండగా అప్పట్లో రిజర్వాయర్ నుంచి కడప జిల్లాకు సుమారు 500 క్యూసెక్కులకు పైగా నీటి విడుదల జరిగేది. ప్రస్తుతం విడుదలవుతున్న నీరు 20 క్యూసెక్కులు మాత్రమే వుండడంతో శ్రీశైలం జలాశయంలో కూడా నీటి మట్టం తగ్గుతుండడాన్ని చూస్తే ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోందన్నారు. ఎస్‌ఇ వెంట అవుకు ఎస్‌ఆర్‌బిసి ఇఇ వెంకటేశ్వర్లు, డిఇ విఠల్‌ప్రసాద్ తదితరులు వున్నారు.
వైభవంగా సూర్యనారాయణస్వామి
కల్యాణోత్సవం
నందికొట్కూరు, ఫిబ్రవరి 17: పట్టణంలోని కోట వీధిలో వెలసిన శ్రీ ఛాయ ఉష సమేత సూర్యనారాయణ స్వామి కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలసిన సూర్యనారాయణ స్వామి దేవాలయం తర్వాతి స్థానం ఈ ఆలయానిదే. రథసప్తమి సందర్భంగా స్వామి వారికి విశేష పూజల అనంతరం ఉష ఛాయదేవి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పుర వీధులు భక్తులతో కిటకిటలాడాయి. పూజల్లో ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి, ఎసిబి కోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు
english title:
water released
Date:
Monday, February 18, 2013