మహానంది, ఫిబ్రవరి 17: మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఇఓ దివాకర్‌బాబుచే వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, శాంతారాంభట్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మూలవరులైన శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథశాల వద్ద సూర్యభగవానుని పూజ కార్యక్రమా లు నిర్వహించారు. అనంతరం రథసప్తమి వేడుకల్లో భాగం గా గణపతిపూజ, పుణ్యహావచనం, సూర్యాహారాధన, అర్థబలులిచ్చి బ్రహ్మాదిదేవతలకు ఆహ్వానం పలికారు. ఈసందర్భంగా వేదపండితులు విశిష్టత గురించి వివరిస్తు మాఘమాసంలో శుద్దసప్తమి రోజున సూర్యభగవానుడు వెలుగును ప్రసాదించడం ప్రారంభించిన రోజునే రథసప్తమి అంటారన్నారు. ఈ రథసప్తమిరోజున బ్రహ్మాదేవుడికి పూజ లు నిర్వహించి అహ్వానం పలికి మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మాత్సవాలకు అదిదేవతగా కొలువుదీరుస్తారన్నారు. మహాశివరాత్రి పర్వదిన అనంతరం 16 రోజుల పండుగ రోజు ఆయనకు ఉద్వాసన పలుకుతారన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు రాజమ్మ, వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్లు ఈశ్వర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, అర్చకులు రాఘవశర్మ, హెడ్‌కానిస్టేబుల్ దేవేంద్రకుమార్ పాల్గొన్నారు.
మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం
english title:
ratha sapthami
Date:
Monday, February 18, 2013