ముషీరాబాద్, ఫిబ్రవరి 9: న్యూస్‌రీడర్లు సాధ్యమైనంత వరకు ఆంగ్లపదాలను వాడకుండా మాతృభాష తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ సూచించారు. జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో టివి న్యూస్‌రీడర్లకు పురస్కార ప్రదానం, జివిఆర్ ఆరాధన-ప్రగతి మీడియా లింక్ స్వర్ణ పతాక బహుకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కన్నా లక్ష్మినారాయణ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రభ సంపాదకులు విజయబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.మధురవాణికి మూడు స్వర్ణపతకాలు బహుకరించారు. టీవీ పురస్కారాలను యశోద(ఈటీవీ2), శైలజ(తెలుగు), విజయ్‌కుమార్(టివి5), యోగిత(ఎన్‌టివి), స్వర్ణ(ఐ న్యూస్), ప్రతిభ(హెచ్‌ఎంటివి), రంగరాజు(స్టూడియో ఎన్), క్రాంతి(సాక్షి), శ్రీనివాస్(ఏబిఎన్), శోభన్‌బాబు(టిన్యూస్), ప్రీతి(హెచ్‌వై టివి), ప్రమోద్‌లకు(మహా టీవీ) ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డా.మంజుల, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, డా.పావులూరి శివరామయ్య, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కూచిపూడి నృత్యకారిణి శృతకీర్తి నాట్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.
న్యూస్‌రీడర్లు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి
english title:
ff
Date:
Friday, February 10, 2012