తిరుపతి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలన్న సుప్రీం కోర్టు తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి త్వరగా ఎన్నికలు జరిపించేందుకు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థలకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు అగిపోయాయన్నారు. దీంతో గ్రామాల్లో నిధుల లేమితో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సిఎం నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనిల్‌కుమార్ భూ ఆక్రమణలపై స్పందిస్తూ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జెన్‌కోను పూర్తి స్థాయిలో బలపరిస్తే కరెంటు కోతలను నివారించవచ్చన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు
english title:
local bodies
Date:
Tuesday, February 19, 2013