గాజువాక, ఫిబ్రవరి 18: అసోంలో కిడ్నాప్ అయన విశాఖ ఇంజనీర్ విడుదలకు ప్రయత్నాలు సాగుతున్నాయ. ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న పైడిరాజు అనే ఇంజనీర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మూడురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అసోం నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రట్ ఆఫ్ బోడోల్యాండ్ సంస్థ ఈ పని చేసి ఉంటుందని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే పైడిరాజు కిడ్నాప్ విషయంపై మంత్రి గంటా అసోం పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ మేరకు పైడిరాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహావిశాఖ గాజువాక జోనల్ పరిధిలోని కణితికాలనీ తెలికల వీధికి చెందిన అప్పారావుఏకైక కుమారుడైన పైడిరాజును కష్టపడి చదివించారు. అనంతరం పైడిరాజు ఢిల్లీకి చెందిన బీసీ నయ్యా అనే సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా చేరాడు. ఇటీవల ఆ సంస్థకు అసోం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రాజెక్ట్ పనులు దక్కటంతో పైడిరాజుతో పాటు మరికొంత మంది ప్రతినిధులను అసోం పంపించారు. శుక్రవారం రాత్రి పైడిరాజును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారంటూ సంస్థ ప్రతినిధులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సోమవారం పైడిరాజు తల్లిదండ్రులు అప్పారావు, నాగమణిలను ఓదార్చారు. అనంతరం ఆయన ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి శేషాద్రి, నగర పోలీస్ కమిషనర్ బి శివధర్‌రెడ్డిని ఫోన్‌లో కోరారు. అలాగే జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేసి వెంటనే తగు చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలని కోరారు. (చిత్రం) పైడిరాజు
అసోంలో కిడ్నాప్ అయన విశాఖ ఇంజనీర్
english title:
engineer
Date:
Tuesday, February 19, 2013