తిరుపతి, ఫిబ్రవరి 18: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయకుండా ఉండేందుకు, సర్వీస్ రిజిస్టర్ నమోదు ఓపెన్ చేసేందుకు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కెవి రమణ, కమ్మపల్లి మెడికల్ ఆఫీసర్ మురళీబాబును సోమవారం తిరుపతి ఎసిబి అధికారులు పట్టుకున్నారు. గత నెల 14న చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిన డాక్టర్ సునీతను ఆమె పై అధికారి ఆర్‌డిడి డాక్టర్ కెవి రమణ లంచం కోసం నిత్యం వత్తిడి తెచ్చేవారు. కమ్మపల్లి మెడికల్ ఆఫీసర్ మురళీబాబు ద్వారా లంచం పంపించాలని సునీతకు ఆర్‌డిడి నిత్యం ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేవారు. అంత ఇవ్వలేనని ఎంత చెప్పినా ఆయన వినలేదు. చివరకు సునీత ఆర్‌డిడితో 12వేల రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని తొలుత 5వేలు అందించారు. తరువాత మరో 7 వేలు ఇస్తానని చెప్పిన ఆమెఈ విషయాన్ని ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎసిబి డిఎస్‌పి కృష్ణార్జునరావుచెప్పిన విధంగా 7 వేల రూపాయలు తిరుపతిలోని ఆర్‌డిడి కార్యాలయంలో సోమవారం సునీత ఇవ్వగా, ఆర్‌డిడి తీసుకుంటూ పట్టుపడ్డారు. ఈ సందర్భంగా ఆర్‌డిడి మాట్లాడుతూ తనకు ఆ డబ్బుతో ఎటువంటి సంబంధం లేదని బుకాయించారు. ఈ సందర్భంగా ఆర్‌డిడి కెవి రమణ, కమ్మపల్లి మెడికల్ ఆఫీసర్ మురళీబాబును అరెస్టు చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయకుండా
english title:
rdd
Date:
Tuesday, February 19, 2013