కీసర, ఫిబ్రవరి 9: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని శ్రీ సాయిధామం పీఠాధిపతి, సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సత్యపదానంద ప్రభూజీ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శ్రీనివాసుడు నిద్రించడానికి సమయం చాలడం లేదనడం అర్థరహితమన్నారు. నిత్య జాగురూకుడైన శ్రీనివాసునికి నిద్రఏమిటి, మెలకువ ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. యజమానిగా, గురువుగా, తల్లిగా, తండ్రిగా, మిత్రునిగా భావించి సేవించేటప్పుడు ఇది సహజమేనని, అయితే ఆ స్థితిని దాటి ఆ పరమాత్ముని సర్వాంతర్యామిగా అనుభూతిని పొందే స్థాయికి చేరిన చిన్నజీయర్ స్వామికి ఈ విషయం తెలియదనుకోలేమన్నారు.
భక్తులు స్వామివారికి కానుకగా సమర్పించిన నిధులు ధర్మ ప్రచారానికి, ధర్మ రక్షణకు సక్రమంగా ఉపయోగించనప్పుడు, దుర్వినియోగం అవుతున్నప్పుడు ఏడుకొండలపై అధార్మిక కార్యక్రమాలు నడపడానికి దుష్టశక్తులు ప్రయత్నించినప్పుడు ఉద్యమం అవసరమేనన్నారు. అటువంటి సందర్భాల్లో జాతి యావత్తూ జాగృతం కావాలన్నారు. కాని ఇప్పుడు అధార్మికులు వెక్కిరించే విధంగా ఇలా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం తగదని సత్యపదానంద ప్రభూజీ పేర్కొన్నారు.
శ్రీనివాసునికి నిద్ర ఏమిటి? మెలకువ ఏమిటి?f
english title:
fff
Date:
Friday, February 10, 2012