కెపిహెచ్‌బి కాలనీ, ఫిబ్రవరి 9: కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీ ఉషాముళ్లపూడి కమాన్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తనకు రేషన్‌కార్డు ఉన్నా సరుకులు ఇవ్వడం లేదని, ఇదే విషయమై పలుమార్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆ వ్యక్తి విద్యుత్ హైటెన్షన్ లైను ఎక్కి హడావిడి చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. దీనికి సంబంధించి కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, నర్వ మండలం, రాంపూర్ గ్రామానికి చెందిన గద్దె సత్తెయ్య(42) కూకట్‌పల్లిలోని మహంకాళినగర్‌లో నివాసముంటూ కూలిపని చేస్తుంటాడు. అయితే ఇతను 2006లో తీసుకున్న రేషన్‌కార్డుకు ప్రస్తుతం సరుకులు ఇవ్వకపోవడంతో ఇదే విషయమై పలుమార్లు బాలానగర్ పౌరసరఫరాల అధికారుల చూట్టూ తిరిగాడు. ఫలితం లేకపోవడంతో విసుగుచెందిన సత్తెయ్య గురువారం తెలంగాణ జెండా చేతపట్టి విద్యుత్ హైటెన్షన్ లైను పైకి ఎక్కాడు. దీంతో విషయం తెలుసుకున్న టిఆర్‌ఎస్ నాయకులు గొట్టిముక్కల పద్మారావుతోపాటు పలవురు నాయకులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొన్నారు. పోలీసులు రంగంలోకి దిగి సత్తెయ్యకు సర్దిచెప్పి ఎట్టకేలకు కిందకు దించారు. ఈ మేరకు సత్తెయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో భాగ్యనగర్‌కాలనీ ప్రాంతంలో కొంతసేపుట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వాహనాలు బారులు తీరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యుత్ హైటెన్షన్ లైను ఎక్కి హల్‌చల్
english title:
ff
Date:
Friday, February 10, 2012