Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హైదరాబాద్ పేలుళ్ల నేపధ్యంలో రెండోరోజూ తనిఖీలు

$
0
0

విజయవాడ , ఫిబ్రవరి 22: రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల మారణకాండతో దేశం ఒక్కసారిగా ఉలికిపడింది. రాష్ట్ర వెన్నులో దడ పుట్టింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం రాత్రి సంభవించిన పేలుళ్ళ దాటికి సుమారు 20మంది చనిపోగా, 80మంది వరకు గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. తీవ్రవాదుల చర్యగా అనుమానించిన ప్రభుత్వం వెంటనే దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా నగర పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిథిలో విస్తృత తనిఖీలు రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగాయి. సీపి స్వయంగా కూడా పాయకాపురం ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ల పరిథిలో ఏసిపిలు రాఘవరావు, సత్యనారాయణరావు, హరికృష్ణల ఆధ్వర్యాన అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది ఏఆర్ సిబ్బంది, క్యూఆర్‌టి సిబ్బంది రహదారులపై మోహరించి వాహనాలు తనిఖీ చేశారు. అదేవిధంగా ముఖ్యప్రదేశాలు, రైల్వేస్టేషన్, బస్టాండు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, కూడళ్ళు తదితర చోట్ల తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నించారు.

నగరంలో శాంతి యాత్రలు
విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లను నిరసిస్తూ నగరంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలకు ప్రజలు తీవ్రంగా స్పందించి తమ సంఘీభావం ప్రకటించారు. యువజన కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నాయకత్వంలో యువకులు బెంజ్‌సర్కిల్ నుంచి పటమటలో ఎన్టీఆర్ విగ్రహం వరకు శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ పిలుపునిచ్చారు. మాజీ ఎంపి, తెలుగుదేశం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి గద్దె రామ్మోహన్ నాయకత్వంలో సిద్ధార్థ కళాశాల వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశంలో ఇటీవల చేరిన యువనేత దేవినేని చంద్రశేఖర్ నేతృత్వంలో మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన జరిగింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ నరహరశెట్టి శ్రీహరి, సభ్యులు కొల్లూరి వెంకటేశ్వరరావు, మీసాబత్తుల శ్రీనివాస్, ఎస్. బాలరాజ్, మట్టా ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

సులభ్ కాంప్లెక్స్‌ల్లో పరిశుభ్రత పాటించాలి
అజిత్‌సింగ్‌నగర్, ఫిబ్రవరి 22: నగర పాలక సంస్థ పరిధిలో ఉండే బిఓటి పద్దతిలో నడపబడే సులభ కాంప్లెక్సుల నిర్వహణలో ఎటువంటి లోపభూయిష్టతకు తావులేకుండా సక్రమ నిర్వహణ చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ జి సువర్ణ పండాదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్, లెనిన్ సెంటర్ సమీపంలోని సులభ కాంప్లెక్సును పరిశీలించిన ఆయన నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సక్రమ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు కాంప్లెక్సు పరిసరాలను కూడా పచ్చదనాన్ని నింపి పారిశుద్ద్యాన్ని నెలకొల్పాలని నిర్వాహకులను అదేశించారు. నగరం, జిల్లాకే కాక కోస్తా జిల్లాలకే వ్యాపార కేంద్రంగా ఉన్న విజయవాడ నగరానికి ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలు తమ వ్యాపార అవసరాలకు రాకపోకలు సాగిస్తున్న నేపద్యంలో వారికి సులభ కాంప్లెక్సుల అవసరం ఎంతైనా వుంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో కాంప్లెక్సులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఏంతైనా వుందన్నారు. కాంప్లెక్సు వినియోగానికి వచ్చే వారికి వారు చెల్లించాల్సిన రుసుము వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగంగా ప్రదర్శించాలన్నారు. ఇదిలావుండగా కాళేశ్వరరావుమార్కెట్, లెనిన్ సెంటర్ తదితర వ్యాపార, వాణిజ్య ప్రధాన కూడళ్లలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తూ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కమిషనర్ వాహన పార్కింగ్‌ను కేవలం సెల్లార్‌లలోనే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యాపార కేంద్రాల నుంచి అధికంగా వస్తున్న చెత్త చెదారంలను డంపర్ బిన్ లోనే వేసేలా చర్యలు తీసుకోవాలని, బిన్‌లకు మించి వస్తున్న చెత్త చెదారంలను రోడ్డు పరిసరాలలోనే వేస్తుండటంతో పరిసరాలు అపరిశుబ్రమవుతున్న తరుణంలో ఆ చర్యలను నివారించడంలో భాగంగా ఎవరైనా యాభై శాతం కంట్రీబ్యూషన్‌తో స్థానిక వ్యాపారులు డంపర్ బిన్‌లను ఏర్పాటు చేసేందుకు ఆశక్తి చూపితే అవసరమైన ప్రాంతాల్లో డంపర్ బిన్‌లను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖాధికారులకు కమిషనర్ పండాదాస్ సూచించారు. వన్‌టౌన్ గణపతిరావురోడ్డు జెండా చెట్టు వద్ద మేజర్ అవుట్ ఫాల్ డ్రైయిన్ పారుదలను పరిశీలించిన కమిషనర్ మురుగు సక్రమ పారుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న చెత్త చెదారం, ఇతర వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఈకార్యక్రమంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం సత్యనారాయణరాజు, సహాయ వైద్య అధికారి డాక్టర్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శిశుమరణాలు అరికట్టాలి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22: గర్భిణీ అయిన ప్రతి మహిళా ప్రభుత్వ అసుపత్రుల్లో ప్రసూతి జరిపించేలా తీసుకున్న చర్యలను ప్రణాళికా బద్ధంగా అమలు చేసినప్పుడే అశించిన మంచి ఫలితాలు సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ యం జ్యోతి అన్నారు. మాతా శిశుమరణాలను అరికట్టేందు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అయన వివరించారు. మాతాశిశుమరణాలను అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు కార్యక్రమంపై శుక్రవారం ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంధ్రంలో వైద్య ఆరోగ్య, స్ర్తి శిశు సంక్షేమశాఖ అధికారులతో అయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడతూ మాతా శిశు సంరక్షణపై సరైన అవగాహన లేకపోవడంతోనే ప్రసూతి సమయంలో సరైన వైద్య సహాయం పోందలేకపోవడం వలన అనేక శిశు మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. గ్రామ, క్లష్టర్ స్థాయిలో వైద్య అరోగ్య సిబ్బంది ఎ ఎన్‌యంలు, అశా వర్కర్లు, ఇందిరాక్రాంతి పథం, స్వయం సహాయక సంఘాలు, అంగన్ వాడీ కార్యకర్తలు సమన్వయంతో పని చేసిన నాడే మాత శిశు మరణాలు అదుపులోనికి వస్తాయన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అయితే మరిన్ని మంచి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంటి పెర్లను నమోదు చేసుకొని అవసరమైన వైద్య సదుపాయాలను ప్రభుత్వ అసుపత్రుల నుండి పొందాలని అయన సూచించారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలు, పల్లె ప్రాంత ప్రజలు సుఖ ప్రసవం ప్రభుత్వ అసుపత్రుల్లో జరిగే విధంగా అందరూ కృషి చేయాలని అయన ఈ సందర్భంగా సూచించారు. ఈ విధంగా కృషి చేస్తున్న అధికారులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందని అయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డ్వామా పిడి వి హనుమానాయక్, ప్రాథమిక అరోగ్య కేంద్రం వైద్యాధికారి వై సుబ్రహ్మణ్యం, బి రవి, సునంద, గీయాబాయ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

వివాహిత అనుమానాస్పద మృతి
పాతబస్తీ, ఫిబ్రవరి 22: ప్రేమించి పెద్దలను ఒప్పించి కోరుకున్నవారితో మూడుముళ్లు వేయించుకున్న ఆ యువతి ఆరు నెలలు తిరక్కముందే అర్ధాంతరంగా తనువు చాలించింది. ఉరేసుకుని బలవన్మరణం పొందగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తపేట పోలీసుల కథనం ప్రకారం పాల ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొడాలి నాంచారయ్య, సాయిరామ్ ధియేటర్ సమీపంలోని సముద్రాల వీధికి చెందిన బి. మానస కొంతకాలంగా ప్రేమించుకుని తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి మానస ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొన ఊపిరుందని భావించిన అత్తింటివారు ఉరికోసి స్థానిక వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని భర్త నాంచారయ్య, అత్తింటివారు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా వాచ్‌ఉమెన్ హత్య కేసులో
నిందితుడి అరెస్ట్
పాతబస్తీ, ఫిబ్రవరి 22: భవానీపురం ఐరన్ యార్డులో జరిగిన వాచ్ ఉమెన్ ఎరిసి బంగారమ్మ (55) అనే మహిళ హత్య కేసులో నిందితుడిని ఒన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. హనుమంతరావు వారి సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి హరికృష్ణ వివరాలు తెలిపారు. ఈ కేసులో నిందితుడు అదే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వేల్పుల పిచ్చయ్య (77)ని అరెస్ట్ చేశారు. భవానీపురం ఐరన్ యార్డు మొదటి రోడ్డులో నివాసం ఉండే ఎరిసి బంగారమ్మ అనే మహిళ తన ఇంటికి సమీపంలో హోల్‌సేల్‌గా ఐరన్ వ్యాపారం నిర్వహించే ప్రసాద్ కంబైన్స్‌లో రాత్రిపూట వాచ్ ఉమెన్‌గా పనిచేస్తోంది. సంవత్సరం క్రితం బంగారమ్మ నివసించే ఇల్లు ప్రమాదవశాత్తూ తగులబడిపోవడంతో ఇంటిని పునర్నించుకునేందుకు అదే ప్రాంతంలో ఉన్న స్వరాజ్య ట్రాక్టర్స్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే వేల్పుల పిచ్చయ్య వద్ద రూ. 10వేల నగదు అప్పుగా తీసుకోవడం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని బంగారమ్మను పలుమార్లు పిచ్చయ్య అడుగగా ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చకపోగా అసభ్య పదజాలంతో తనను దూషించిందని బంగారమ్మపై కక్ష పెంచుకున్న పిచ్చయ్య బంగారమ్మను ఎలాగైనా హత్య చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. హత్యా పథకం అమల్లో భాగంగా బుధవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో బంగారమ్మ పనిచేసే ఐరన్ షాపు వద్దకు పిచ్చయ్య చేరుకున్నాడు. ఆ సమయంలో షాపు బయట కాపలా కాస్తున్న బంగారమ్మ వద్దకు పిచ్చయ్య వచ్చి తన వద్ద తీసుకున్న అప్పు విషయం గురించి అడగ్గా తిరిగి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఆవేశానికి లోనైన పిచ్చయ్య వెంటనే పక్కనే ఉన్న సిమెంటు రాయిని తీసుకుని బంగారమ్మ తలపై రెండుసార్లు బలంగా కొట్టడం జరిగింది. తలపై బలమైన దెబ్బ తగలటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం బంగారమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న పిచ్చయ్య శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకునివెళ్లి బంగారమ్మ నివాసం ఉండే ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి ఇంటికి తాళం వేయడంతోపాటు తాళాన్ని తనతో తీసుకుని వెళ్లటం జరిగింది. అనంతరం హత్య చేసేందుకు ఉపయోగించిన రాయిని ఇతరులు గుర్తించకుండా ఉండేందుకు పక్కనే ఉన్న పొదల్లో పడవేశాడని ఎసిపి వివరించారు. ఈ కేసులో త్వరితగతిన నిందితుడి గురించి సమాచారం సేకరించి అరెస్ట్ చేయడంలో ఒన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ హనుమంతరావు వారి సిబ్బంది కృషి ఫలించింది. ఈ సమావేశంలో ఎసిపితోపాటు సిఐ కె. హనుమంతరావు, ఎస్‌ఐ హనీఫ్, క్రైం ఎస్‌ఐ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

వాహన చోదకులకు కౌనె్సలింగ్
విజయవాడ , ఫిబ్రవరి 22: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు ట్రాఫిక్ అదనపు డిసిపి ఎవి రమణ కౌనె్సలింగ్ నిర్వహించారు. అంతటితో వదలకుండా వారికి భారీగా జరిమానా వడ్డించారు. మరోమారు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వాహన చోదకుల తల్లిదండ్రుల సమక్షంలో వారిని హెచ్చరించారు. గత రెండు రోజులుగా నగరంలోని అన్ని ట్రాఫిక్ పోలీస్టేషన్ల పరిథిలో అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించారు. వీరిలో దాదాపు అందరూ విద్యార్థులే కావడం గమనార్హం. త్రిబుల్ డ్రైవింగ్‌కు సంబంధించి 44 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, నెంబర్ ప్లేట్లు లేకపోవడం, నెంబర్ ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా లేకుండా వాహనాలు నడపటం వంటి వాటికి సంబంధించి 22 కేసులు నమోదు చేశారు.

రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల
english title: 
searches

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles