ప్రిటోరియా, ఫిబ్రవరి 22: ‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్‌కు బెయిల్ లభించింది. గర్ల్‌ఫ్రెండ్ రీవాను హత్య చేసినట్టు పిస్టోరియస్ అభియోగాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను న్యాయమూర్తి డెస్మండ్ నాయర్ ముందు ఉంచి, పిస్టోరియస్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని, విచారణ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోరారు. అయితే, పిస్టోరియస్ తరఫు న్యాయవాది బారీ రూక్స్ తన క్లయింట్ పొరపాటున రీవాపై కాల్పులు జరిపాడని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఎవరో తన ఇంట్లోకి చొరబడినట్టు పొరబడిన పిస్టోరియస్ కాల్పులు జరిపాడని, ఈ సంఘటనలో రీవా మృతి చెందిందని పేర్కొన్నాడు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత పిస్టోరియస్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇలావుంటే, బెయిల్‌పై తుది వాదన జరుగుతున్నంత సేపు పిస్టోరియస్ డాక్‌లో నిలబడి ఏడుస్తూ కనిపించాడు. వెక్కిళ్లుపెట్టి విలపిస్తున్న అతనిని ఓదార్చడానికి కోర్టు హాల్‌లోనే ఉన్న అతని తండ్రి హెనే్క, సోదరుడు కార్ల్, సోదరి అమీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థాణువులా నిలబడిపోయిన అతను దీనంగా కనిపించాడు. కాగా, పిస్టోరియస్‌కు బెయిల్ మంజూరు చేసినందువల్ల సమస్యలేవీ రావని న్యాయమూర్తి నాయర్ అభిప్రాయపడ్డాడు. సమాజానికి, శాంతికి భంగం కలిగించే పనులు చేయరాదని పిస్టోరియస్‌ను హెచ్చరించాడు.
‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్‌కు బెయిల్ లభించింది.
english title:
p
Date:
Saturday, February 23, 2013