కాబూల్, ఫిబ్రవరి 24: అఫ్గానిస్తాన్‌లోని వార్దక్, లోగర్ రాష్ట్రాల నుంచి వెంటనే అమెరికా దళాలను తరిమికొట్టాలని దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తన సైనిక దళాలను ఆదేశించారు. రెండువారాల్లో అమెరికా ప్రత్యేక దళాలు ఈ ప్రాంతాల్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ కల్లోలిత రాష్ట్రాల్లో అమెరికా దళాల వల్ల అశాంతి, అస్థిర పరిస్థితులు రగులుకుంటున్నాయిన కర్జాయ్ పేర్కొన్నారు. ఆదివారంనాడు జాతీయ భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన రెండు వారాలకు మించి ఈ ప్రాంతాల్లో అమెరికా దళాలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివర్లో అఫ్గాన్ నుంచి వైదొలగేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి అమెరికా దళాలను తరిమికొట్టాలని కర్జాయ్ పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా వాస్తవాలు నిర్ధారించుకుని తగిన చర్యలు తీసుకుంటామని అఫ్గాన్‌లో అమెరికా దళాల ప్రతినిధి స్పష్టం చేశారు.
అఫ్గాన్ సైనికులకు కర్జాయ్ ఆదేశం
english title:
a
Date:
Monday, February 25, 2013