న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: భారత అంతర్జాల (ఇంటర్నెట్) వ్యవస్థకు హైజాక్ ముప్పు పొంచి ఉందా? అవుననే అంటోంది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్). మన ఇంటర్నెట్ వ్యవస్థ ఇప్పుడు స్పామ్ దాడికి గురవుతోందని, సెర్చ్ ఇంజిన్ వైరస్ నుంచి ముప్పు పొంచి ఉందని సెర్ట్ పేర్కొంది. దీనివల్ల సెర్చ్ ఇంజిన్ రెక్వెస్ట్‌లు హైజాక్‌కు గురవుతాయని, ఫలితంగా బ్రౌజింగ్ వేగం మందిగిస్తుందని, అనుమానాస్పద వెబ్‌సైట్లు ఓపెన్ అవుతాయని దేశంలోనే ప్రధానమైన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన సెర్ట్ తాజాగా ఇంటర్నెట్ వినియోగదారులకు సూచించింది. సెర్చ్ ఇంజిన్ ఫలితాలను హైజాక్ చేసేందుకు ‘బామిటాల్’ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించారని సెర్ట్ తెలిపింది.
మానిటర్‌పై మనకు కనిపించిన ఏదైనా సెర్చ్ రిజల్ట్‌పై వౌజ్‌తో క్లిక్ చేసినప్పడు అటాకర్ నియంత్రణలో ఉన్న సర్వర్ (బామిటాల్ సర్వర్)కు రీ-డైరెక్ట్ చేయబడుతుంది. ఈ బామిటాల్ సర్వర్లు అడ్వర్టైజ్‌మెంట్ సర్వర్లకు గాని అటాకర్ ఎంపిక చేసిన మరేవైనా వెబ్‌సైట్లకు గాని రీ-డైరెక్ట్ చేస్తాయి. ఫలితంగా ఇంటర్నెట్ వినియోగదారుడితో సంబంధం లేకుండానే అడ్వర్టయిజ్‌మెంట్లపై క్లిక్ చేసే శక్తి ఈ బామిటాల్ సర్వర్లకు ఉంటుంది. పైగా ఈ బామిటాల్ సర్వర్లు బ్రౌజర్ ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తాయి. సెక్యూరిటీ సంబంధిత వెబ్‌సైట్లతో అనుసంధానం కాకుండా చేస్తాయి. ఈ బామిటాల్ మాల్వేర్‌ను ఎదుర్కోవడానికి నమ్మకమైన యాంటీ వైరస్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఇంటర్నెట్ వినియోగదారులకు సెర్ట్ సూచించింది.
భారత అంతర్జాల (ఇంటర్నెట్) వ్యవస్థకు హైజాక్ ముప్పు పొంచి ఉందా?
english title:
i
Date:
Monday, February 25, 2013