కరీంనగర్, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో నక్సలైట్ల ఏరివేత కోసమే కరీంనగర్, విశాఖపట్నంలలో గ్రేహౌండ్ బలగాలతో కూడిన ప్రత్యేక యూనిఫైడ్ కమాండ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహాదేవపూర్‌లో యూనిఫైడ్ కమాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై కేంద్రం రాష్ట్రానికి అందజేసిన వి-17 చాపర్‌ను ప్రారంభించారు. వీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, ఒరిస్సాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని తీవ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెలిక్యాప్టర్ అందజేసిందని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఎన్‌ఎస్‌జి తరహాలో గ్రే హౌండ్స్‌కు ప్రత్యేక శిక్షణను ఇచ్చి కమాండ్ ద్వారా నక్సలైట్ల ఏరివేత నిర్వహించనున్నామన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్స్ కార్యకలాపాలు లేకపోయినా ఉనికిని చాటుకునేందుకు తరచూ వచ్చిపోతుంటారని అంటూ ఇక్కడ కమాండ్ ఏర్పాటు వల్ల ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర పరిధిలోని గడ్చిరోలి, భద్రకాళి, బీజాపూర్ తదితర ప్రాంతాల్లో బలగాలను సత్వరమే దించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. త్వరలో విశాఖపట్నంలో కూడా కమాండ్‌ను ఏర్పాటు చేస్తామని ఎఒబిలో నక్సల్స్ కార్యకలాపాల తీవ్రత అధికంగా ఉన్నందున కేంద్రం అందజేసిన చాపర్‌ను విశాఖపట్నం కేంద్రంగానే నక్సల్స్ ఆపరేషన్లకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి రొటీన్‌గానే రాష్ట్రాలకు సమాచారం అందిస్తుందని, తాముకూడా అందుకు తగ్గట్లుగానే స్పందించి చర్యలు చేపడతామన్నారు.
రాష్ట్రంలో నక్సలైట్ల ఏరివేత కోసమే కరీంనగర్, విశాఖపట్నంలలో
english title:
unified commands
Date:
Tuesday, February 26, 2013