పీలేరు, మార్చి 3: ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న తనను అదే పాఠశాలలో పనిచేస్తున్న ఇతర ఉపాధ్యాయులు అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నెరబైలు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జి.నారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు స్థానికులైనందున వారి పెత్తనం పాఠశాలలో సాగాలని తనను పలు రకాలు ఇబ్బందులుకు గురిచేస్తున్నట్లు ఆయన వాపోయారు. పాఠశాలకు ఆలస్యంగా రావడం, ముఖ్యమైన సమావేశాలకు సెలవు కూడా పెట్టకుండా నిలిచిపోవడం, విద్యార్థులతో రిజిష్టర్ వారిళ్లకు తెప్పించుకుని సంతకాలు చేయడం, ఇది ఏమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారన్నారు. తనను మానసికంగా వేధించడంతోపాటు తాగే టీలో పేడ కలుపుతున్నారని వాపోయారు. దీనిపై దీనిపై స్థానిక ఎంఇవో, డిఇవో, డిప్యూటీ డిఇవో, ఆర్‌జెడిలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఎంఇవో వెంకట బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అదే పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల తీరుపై హెడ్మాస్టర్ తనకు ఫిర్యాదు ఇచ్చారన్నారు. దానిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు.
* మానసిక క్షోభకు గురిచేస్తున్నారు * ఉపాధ్యాయుల తీరుపై ఉన్నతాధికారులకు హెచ్‌ఎం ఫిర్యాదు * ఎంఇవో దర్యాప్తు
english title:
meo
Date:
Monday, March 4, 2013