అనూజ్‌రామ్, దేవన హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జె.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీడ’. టాలీవుడ్ ట్రెండ్స్ బ్యానర్‌పై వేలువోలు శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో వుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు జె.ఎస్.చౌదరి మాట్లాడుతూ నీడ అనేది రెండు రకాలు. ఒకటి కాపాడే నీడ, మరోటి వెంటాడే నీడ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అసలు ఈ సినిమా ఇతివృత్తం ఏమిటనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. నేను రాసుకున్న స్క్రిప్టును చక్కగా తెరకెక్కించాను. ఔట్‌పుట్ బాగా వచ్చింది. సంగీతానికి మంచి పేరొచ్చింది. ఆడియో హిట్ తర్వాత సినిమాపై కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇది అందరికీ మంచి పేరుతెచ్చే చిత్రమవుతుంది అన్నారు. సంగీత దర్శకుడు విజయ్ కూరాకుల మాట్లాడుతూ దర్శకుడు తొలి చిత్రంలా కాకుండా ఎంతో అనుభవం వున్నట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్ చక్కని సాహిత్యాన్ని అందించారు. సినిమా బాగా వచ్చింది. ఆడియో హిట్ అయినట్టుగానే సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ నిర్మాతగా ఇది నాకు మొదటి చిత్రం. చాలా కష్టపడి సినిమాను పూర్తిచేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. హీరో అనూజ్‌రామ్ మాట్లాడుతూ సినిమా రషెస్ చూశాం. చాలా బాగా వచ్చింది. నాకు మంచి ఎంట్రీగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను. పాటల రచయిత విజయ్ మాట్లాడుతూ పాఠాలు చెప్పుకునే నన్ను పిలిచి పాటలు రాయమని అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. రవిబాబు, పృథ్వి, సంధ్యాజనక్, అంబటి శ్రీను నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరాకుల, పాటలు: ప్రియమణి విజయ్, కెమెరా: పి.సి.కన్నా, సహ నిర్మాతలు: గారపాటి శ్రీనివాస్, వెలువోలు సురేష్, కొడాలి రవికుమార్, నిర్మాత: వెలువోలు శ్రీనివాసరావు, రచన, దర్శకత్వం: జె.ఎస్.చౌదరి.
అనూజ్‌రామ్, దేవన హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జె.ఎస్.చౌదరి దర్శకత్వంలో
english title:
needa
Date:
Wednesday, March 6, 2013