Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అపోహలు తోడైతే శృంగారం నిస్సారం

$
0
0

మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం లాంటి అంశాలు మనిషిని నిత్యయవ్వనుడిగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇటువంటి వారు ఏళ్లు నిండుతున్నా ఉత్సాహంగా ఉంటూ శృంగార జీవితంలో కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోకుండా గడుపుతూ ఉంటారు. అనుభవం, మంచి ఆలోచనలతో వీరు లైంగిక జీవితంలో నిత్యం స్వర్గసుఖాలు అనుభవిస్తూ వుంటారు. మనిషికి లైంగిక జీవితం ఎంతో ముఖ్యమైనది, కీలకమైనది. జీవితానికి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం.

* సమాజంలో ఎక్కువమంది వయసు మీరకపోయినా అనేకానేక కారణాలతో అనుభవించాల్సిన మధుర శృంగార జీవితానికి దూరమవుతున్నారు.
* సరైన శారీరక పోషణ లేకపోవడం, ప్రకృతికి విరుద్ధంగా జీవనశైలి, మానసిక వత్తిడి, రకరకాల వ్యసనాలకు బానిసలు కావడంవంటి కారణాల వల్ల కొంతమందిలో వృద్ధాప్యం నడివయసులోనే వచ్చేస్తుంది. వీరిలో లైంగికపరమైన కోరికలు అంతగా పురివిప్పవు.
* నడివయసు దాటినవారు కొంతమంది లైంగికపరమైన ఆలోచనలు రావడం చాలా తప్పుగా పరిగణిస్తారు. అదొక పాపకార్యమని, కుర్రచేష్ట అని భావిస్తారు. మనసులో ఏ చిన్న లైంగిక ధోరణి ఏర్పడ్డా దానిని తుంచేస్తారు.
* వయసు కాస్త పైబడిన దంపతులు తగిన శృంగార జీవితాన్ని పొంది ఉండడం వల్ల వారి ఆరోగ్యం బాగుండడమేగాక ముఖవర్చస్సులో యవ్వన ఛాయలు తొంగిచూస్తూ ఉంటాయి.
* పెళ్లి పరమార్థంగా పిల్లల్ని కంటారు. వారికి పెళ్లిళ్లు చేస్తాం. ఇప్పుడు ఈ వయసులో మనసు లో చలించే ఆలోచనలు ఏమిటి? అనుకునేవారు కూడా ఉంటారు. ఇది సరియైన విధానం కాదు. దాంపత్య జీవితానికి ఏ వయసు ముగింపు కానేకాదు.
నిత్య యవ్వనం
* శరీరాకృతి యవ్వన కాంతితో మిలమిలలాడుతూ ఉండాలంటే ఆహార, విహార, వ్యవహారాలలో కొన్ని మెళకువలు పాటించాలి.
* అనుదినం ఒకటిన్నర లీటర్ల నీటిని తాగాలి. మన శరీర చర్మం ముడతలు పడకుండా ఈ నీరు కాపాడుతుంది. చర్మకణాలు నీరసపడి, ముడతలు పడకుండా వాటిని మృదువుగా వుంచే శక్తి నీటికి ఉంది.
* తాజాపళ్లు తినాలి. ముదురు ఆకుపచ్చని కూరలు బాగా తినాలి. వృద్ధాప్య లక్షణాలను సెలీనియా అనే పదార్థం నిరోధిస్తుంది.
* కోడిమాంసం, బాదం పప్పులో సెలీనియా ఉంటుంది.
* చర్మానికి, జుట్టుకి మేలు చేసే విటమిన్లు సి, ఇ-తో పాటు ఇతర పోషకాలు ఉండే ఆపిల్స్, ద్రాక్ష, నిమ్మ, నారింజ, ఆక్రోటు కాయలు తింటూ ఉండాలి.
* చర్మం పొడారిపోకుండా, ముడతలు పడకుండా చేపలు, ఆవనూనెలో ఉండే ఒమేగా-3, 6 కొవ్వు ఆమ్లాలు కాపాడుతాయి. అందుకే వీటిని కూడా తిండిలో భాగంగా చేసుకోవాలి.
* కంటినిండా నిద్ర ఎంతో అవసరం. చర్మం నిగనిగలాడడానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రించే సమయంలోనే మృత చర్మకణాల స్థానాల్లో 80 శాతం కొత్త చర్మ కణాలు తయారవుతాయి.
* అనుదినం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రించడం వాంఛనీయం. అప్పుడు చర్మకాంతి కాపాడబడుతుంది.
శృంగారానికి సంకెళ్లు..!
* శృంగార జీవితం మనిషికి మంచి ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అదొక (గ)మత్తు వ్యాయామం. అనుభూతుల పర్వంలో తరించేందుకు ఈ ఆటలో స్ర్తి, పురుషులు భాగస్వాములే.
* ఆడ,మగ ఇరువురి సరదా కోరికలను తీర్చే ఈ మధుర సన్నివేశంలో ఎక్కువ, తక్కువలకు చోటు ఉండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, అభిమానించుకోవాలి. సుఖసంతోషాలు పంచుకోవాలి.
* భార్యాభర్తల మధ్య ఏకాంతం ఎంతో అవసరం. అది కొరవడితే జీవితంలో మాధుర్యం పూర్తిగా ఆస్వాదించలేరు. జీవితం యాంత్రికంగా తయారవుతుంది.
* చాలామంది దంపతుల్లో పెళ్లయి ఎన్ని సంవత్సరాలు అయినా ఉండాల్సిన సాన్నిహిత్యం ఉండకపోవడం వారి లైంగిక జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. క్రమశిక్షణగా లేని జీవితాలు విలువైన దాంపత్య సుఖాన్ని ఆస్వాదించలేవు.
* ధూమపానం, మద్యపానం, మత్తుమందులు, మధుమేహం వంటివి లైంగిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
* దంపతులు ఆనందమయ శృంగార జీవితం అనుభవించడానికి పరిశుభ్రత తొలి పెట్టుబడి. చాలామందిలో ఇది కొరవడుతూ ఉంటుంది. దుర్వాసనలు దంపతులను ఎడమొగం, పెడమొగంలోకి తీసుకువెడతాయి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి.
* దాంపత్య సుఖాన్ని పొందమని ఆహ్వానించేటట్లు పడక గది ఉండాలి. మధ్యతరగతి కుటుంబాల్లో పడక గది, స్టోర్ రూమ్, ఇంకా ఇతర సామాగ్రి భద్రపరచుకునే గది ఒకటే కావడం వారి లైంగిక జీవితానికి ఒక రకంగా కావలసిన సౌకర్యాలు లేని విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
* చాలామంది దంపతుల్లో లైంగిక విజ్ఞానం ఉండదు. సంసార జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎన్నో అపోహలు, అనుమానాలు వేధిస్తునాన ఎవరినీ అడగలేరు. తాము ఏదో నష్టపోతున్నామని ఆందోళన చెందుతూ ఉంటారు.
* మగవాడిలో లైంగిక వాంఛ దెబ్బతిన్నప్పుడు తన భార్య తనను శక్తిహీనుడిగా గమనిస్తుందని భయపడతాడు. ఆమెతో సాన్నిహిత్యానికి అతడు ఇష్టపడడు. కారణం తెలియని ఆమె అతడిని అనుమానిస్తుంది. ఫలితంగా వారి జీవితాల్లో చీకట్లు అలముకుంటాయి.
* తన సమస్యను భార్యకు నైపుణ్యంగా వివరించుకోవాలి. ఇద్దరూ కలిసి ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ విషయంలో మగవానికి ‘మగ అహం’ ఎప్పుడూ అడ్డుగోడగా నిలుస్తూనే ఉంటుంది.
* ఎంతటి కష్టతరమైన పనినయినా సమయం, సందర్భం చూసుకుని సాధించగల మగవాడు భార్య దగ్గర సమయం, సందర్భం మరచి లైంగిక వాంఛ తీర్చుకోవాలని భావిస్తాడు.
* భార్యాభర్తలిద్దరూ మానసికంగా ఉత్తేజ స్థితికి వచ్చినపుడే శృంగారం పండుతుంది. ఈ విషయం తెలిసినా చాలామంది తమ లైంగిక జీవితాలను యాంత్రికంగానే గడిపేస్తూ ఉంటారు.
* లైంగిక జీవితానికి వయసు పరిమితి లేదు. డెబ్బయి ఏళ్ళు దాటిన వారు కూడా కొత్త దంపతుల్లా సుఖ సంసారం చేసుకుంటున్నారని పరిశోధకులు చెపుతున్నారు.
లైంగిక శక్తిని దెబ్బతీసేవి..
* కొన్ని ఔషధాలు మనిషి లైంగిక వాంఛను తగ్గిస్తాయి. లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి విషయంలో తగిన జాగరూకతతో ఉండాలి.
* ఈ ఔషధాలు దీర్ఘకాలం వాడడం వల్ల సాధారణంగా ఇటువంటి దుష్ఫలితాలు వస్తాయి. తనకు లైంగిక శక్తి తగ్గిందని చెప్పడానికి చాలామంది ఇష్టపడరు. ఫలితంగా సంసార సుఖానికి దూరమై నిస్సారంగా బతికేస్తూ ఉంటారు. వైద్యుడికి సమస్య చెబితే ఏదైనా ప్రత్యామ్నాయం లభించవచ్చు.
* నిద్రమాత్రలు కూడా దాంపత్య జీవితంపై ప్రభావితం చూపుతాయి. తాము వాడే మందులువల్ల ఇబ్బంది కల్గుతోందని గ్రహించగానే వాటికి బదులు ఇతర మందులు వైద్యుడి సలహా మేరకు మార్చుకోవాలి.
* డిప్రెషన్ తగ్గడానికి వాడే ఫ్లోక్సెటిన్ హైడ్రోక్లోరైడ్, ఎమిట్రిటైలిన్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు లైంగిక శక్తిని తగ్గిస్తాయి. ఇలాంటి మందులకు బదులుగా వ్యాయామం, ప్రవర్తనపరమైన చికిత్సలు చేయించుకోవాలి.
* రక్తపోటును అదుపులో ఉంచేందుకు వాడే మందులు అన్ని విధాలా మంచివి కావు. వీటిని వాడేవారు నిశ్శబ్దంగా దుష్ఫలితాలు భరిస్తారు. కారణాలు తెలిస్తే ప్రత్యామ్నాయాలు ప్రయత్నిస్తారు.
* కడుపులో పుళ్లకువాడే మందులు, ఆకలిని మందగింపజేసేందుకు ఉపయోగించే మందులు, పార్శ్వపు తలనొప్పి మందులతోకూడా ఇదే ఇబ్బంది. ప్రత్యామ్నాయాలు అనే్వషించుకోవాలి.

మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం లాంటి అంశాలు మనిషిని నిత్యయవ్వనుడిగా ఉండేందుకు సహకరిస్తాయి.
english title: 
a
author: 
-సి.వి.సర్వేశ్వర శర్మ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>