* కనుబొమలు మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వాటి ఆకారం, రంగుపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. విభిన్న రంగుల్లో ‘ఐ బ్రో’ పెన్సిళ్లు, పౌడర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా, మేకప్ విషయంలో మెళకువలు అవసరం.
* ‘ఐ బ్రో’ పెన్సిల్‌తో కనుబొమలపై సన్నటి గీత గీసుకుని, తర్వాత చేతులతో మెత్తగా అద్దుకోవాలి. పరిశుభ్రమైన దూదిని చిన్న ఉండలా చేసుకుని కూడా రంగును రాసుకోవచ్చు. విభిన్న రంగుల పెన్సిళ్లను వాడుకుని కనుబొమలకు పలురకాల ‘షేడ్స్’ తేవచ్చు.
* రంగు రంగుల పౌడర్లను వాడి కనుబొమలకు కొత్త అందాలు తీసుకురావచ్చు. చర్మంపై రసాయనాల ప్రభావం పడకుండా కనుబొమలపై జాగ్రత్తగా రంగు వేసుకోవాలి.
* కనుబొమల ఆకారం, సైజును బట్టి రంగులను వాడితేనే ముఖానికి అందం పెరుగుతుంది.
* పగటి పూట రంగు వేసుకుని రాత్రి నిద్రపోయే ముందు కనుబొమలను శుభ్రం చేసుకుంటే మంచిది.
* ఫంక్షన్లకు వెళ్లేటపుడు ధరించే దుస్తుల రంగుల మేరకు కనుబొమలకు ‘కలరింగ్’ వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది.
* రంగులు వాడే సమయంలో రసాయనాల ప్రభావం గురించి అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేకుంటే చర్మంపై ‘సైడ్ ఎఫెక్టు’ల ప్రభావం తప్పదు.
* కనుబొమలు మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వాటి ఆకారం
english title:
idia
Date:
Wednesday, March 6, 2013