‘ఇంగ్లీష్ చదువులతో గొప్ప చిక్కొచ్చి పడింద’ని ‘కన్యాశుల్కం’లో అన్నట్లు- నగరాల్లో నేడు చాలా నేరాలకు ఇంగ్లీష్ చదువులే కారణమవుతున్నాయంటూ ముంబై పో లీసు కమిషనర్ కొత్త సంగతులను ఆవిష్కరించారు. ఇంగ్లీష్ మాధ్యమంలో చదువులు వెలగబెడుతున్న వారిలో చాలామంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముంబై కొత్వాల్ సత్యపాల్ సింగ్ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ముంబైలో 150 హత్యలు జరిగితే అంతకు ఎనిమిది రెట్లు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని, అధిక శాతం నేరాల్లో చదువుకున్న వారి ప్రమేయం ఎక్కువగా ఉంటోందని ఆయన గణాంకాలను ఉటంకిస్తున్నారు. చదువుకోని వారు ఆత్మహత్యలకు పాల్పడడం తాను ఇంతవరకూ వినలేదని, పూణెలో కమిషనర్‌గా పనిచేసిన కాలంలో నేరాలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసినట్లు ఆయన వివరించారు. పాఠశాలలు, కళాశాలల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు స్థానం లేకుండా పోయిందని, జీవితానికి సంబంధించి తగిన శిక్షణ లేకపోవడమే అనర్థాలన్నింటికీ మూల కారణమని సత్యపాల్ తేల్చి చెప్పారు.
‘ఇంగ్లీష్ చదువులతో గొప్ప చిక్కొచ్చి పడింద’ని ‘కన్యాశుల్కం’లో
english title:
inglish
Date:
Wednesday, March 6, 2013