ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం అత్యాఛారాల కేసుల వల్ల మరింతగా పెరిగింది. మన దేశంలో సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుదాకా పెండింగ్ కేసుల సంఖ్య చూస్తే గుండెలు బాదుకుంటాం. దేశంలో 3.2 కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి! ఇక జడ్జీల సంఖ్య ఎటూ చాలదు. సువిశాల భారత్‌లో 18 వేలమంది న్యాయమూర్తులున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం భోగట్టా. గనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టులే కాదు, మరో 12 వేల మంది జడ్జీలను అత్యవసరంగా నియమించాలి. ఇటీవల నేషనల్ కోర్టు మ్యానేజిమెంట్ సిస్టమ్ సమావేశమయింది. సమస్యని క్షుణ్ణంగా పరిశీలించగా ప నె్నండు వేలమంది న్యాయమూర్తులను రిక్రూట్ చేసుకోవాలన్నది ఖారారైంది. అంటే - కొత్తవారికి ఉన్నత ఉద్యోగాలు దొరికే బంగారు అవకాశం వచ్చిందన్నమాట! ఇప్పుడున్న ‘ట్రెండ్’ చూస్తే- రానున్న మూడు దశాబ్దాల కాలంలో కేసుల సంఖ్య 15 కోట్ల (అక్షరాలా పదిహేను కోట్లే!) దాకా పెరిగి తీరుతుంది. అప్పుడు 75 వేల మంది జడ్జీల అవసరం వుంటుంది. అంచేత ‘లా’ కాలేజీలకి మంచి కాలం- గొప్ప డిమాండూ వుంటాయన్నమాట.
ఐ.ఎ.ఎస్‌ని వేధించిన లేడీ కానిస్టేబుల్!
ఇది అడ్డం తిరిగిన కథ! సాధారణంగా మ గాళ్లు- వాళ్లు ఏ వర్గం వాళ్లయినా, పోలీసు వర్గాలయినా- ఆడవాళ్లకు సెల్‌ఫోన్‌ల ద్వారా అశ్లీల, అసభ్యకరమైన సందేశాలు పంపించి, వేపుకునితింటారు. ఎస్.ఎం.ఎస్‌ల దెబ్బకి తట్టుకోలేక అబలలు సతమతమవుతూ వుంటారు. కానీ, బీహార్‌లోని ‘గయ’ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జ్యోతికుమారి- ఏకంగా తన లక్ష్యంగా- శిక్షణ పొందుతున్న ఓ ఐ.ఎ.ఎస్ అధికారినే ఎంచుకుంది.
కన్వాల్ తనూజ్ అక్కడ కాబోయే కలెక్టర్‌గా ట్రెయినింగ్ తీసుకోడానికి వచ్చాడు. అతణ్ని జ్యోతీకుమారి వేళగానివేళ, అతి ముఖ్యమయిన సమావేశాల్లో వుండగా తన మొబైల్ మీద పిలిచి సరసాలు మొదలెట్టింది. పులి మీసాలతో వుయ్యాలలూగుతున్నట్లు- ఆ ఆఫీసర్‌ని రకరకాల, అసభ్య, అశ్లీల (అవేమిటో కన్వాల్ తనూజ్‌కే తెలియాలి) సందేశాలతో- చిత్ర విచిత్రంగా వేధిస్తోందని- ‘రేపటి ఐ.ఏ.ఎస్ అధికారి’ గోల. ఇక తట్టుకోలేక- జిల్లా పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
పోలీసులు- తోటి లేడీ కానిస్టేబుల్- జ్యోతీ కుమారిని అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్‌లోని సందేశాలని తీసి- దర్యాప్తు కొనసాగించక తప్పదుగా? కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టడానికే ప్రయత్నించడం అంటే- ఇదే కదా?!
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం అత్యాఛారాల కేసుల వల్ల మరింతగా పెరిగింది.
english title:
veeraji
Date:
Wednesday, March 6, 2013