నెల్లూరుసిటీ, మార్చి 6: నెల్లూరు నగరంలోని ప్రధానమైన 8 ప్రాంతాలలో 2.35కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసిన్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం చిల్డ్రన్స్ పార్కు రోడ్డు దగ్గర 50లక్షల రూపాయలతో ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మొత్తం 8ప్రాంతాలలో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాలలో ఐమాస్ట్ లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. నగరానికి కొత్త హంగులు తెచ్చేందుకు ఒక ప్రణాళిక ప్రకారం రోడ్లు విస్తరణ కార్యక్రమం జరుగుతోందన్నారు. నెల్లూరు నగరం మీదుగా ప్రయాణించే ఇందుకూరుపేట రోడ్డు, ఇరుకళ పరమేశ్వరి నగర్‌రోడ్డు, పెన్నాబ్రిడ్జి నుండి అయ్యప్పగుడి వరకు రోడ్ల వెడల్పు కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమం వాయిదా పడటం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి సూచన మేరకు ముందుగా సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమానికి నెల్లూరు వస్తున్నట్లు తెలిపారు. సిఎం చేతులు మీదుగా మెడికల్ కాలేజి, రోడ్ల విస్తరణ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. అనేక దశాబ్దలుగా ఆనం కుంటుబంలోని ముగ్గురుని మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేశారని వారి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. ప్రజల కోరిక మేరకు నెల్లూరుజిల్లాను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచే వచ్చిన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని అటువంటి వారికి బుద్ధి చెప్పేందుకే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 2050 సంవత్సరం వరకు తాగునీరు ఇబ్బంది లేకుండా 450కోట్ల రూపాయలతో సంగం బ్యారేజి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నగర ప్రజలకు రెండు పూటల తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. హడ్కో నిధులతో అండర్ గ్రౌండ్‌డ్రైనేజి పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ముందుగా శెట్టిగుంట రోడ్డు, భక్తవత్సలనగర్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేఫీడర్స్ రోడ్డు, మాగుంట విగ్రహం తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డి, సిటీ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ యలమూరి రంగయ్యనాయుడు, జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు, డిఆర్‌ఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో
తొలిరోజు ఇద్దరు డీబార్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 6: జిల్లాలో 93 కేంద్రాల్లో ఇంటర్‌మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలకు సంబంధించి పరీక్షలకు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 30,136 మందికి గాను 1556 మంది గైర్హాజరైనట్లు ఇంటర్‌మీడియట్ బోర్డు నెల్లూరు ప్రాంతీయ అధికారి (ఆర్‌ఐఓ) వై పరంధామయ్య తెలిపారు. మొత్తం 28,580 మంది పరీక్షలు రాసినట్లు వివరించారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. జిల్లాలోని మండల కేంద్రమైన విడవలూరు పరీక్షా కేంద్రంలో అదే కళాశాలలో చదువుతున్న ఒకేషనల్ విద్యార్థి డీబార్ అయినట్లు ఆర్‌ఐఓ చెప్పారు. సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో బిఎఫ్ బాలస్వామి జూనియర్ కళాశాలలో చదివే తెలుగు విద్యార్థి కూడా డీబార్ అయినట్లు వెల్లడించారు. కాగా, 93 పరీక్షా కేంద్రాలకుగాను 78 కేంద్రాల్ని జిల్లా పరిశీలన కమిటీ ప్రతినిధులు సందర్శించారు.
‘దళారుల మాటాలు నమ్మి మోసపోవద్దు ’
కోట, మార్చి 6: దళారుల మాటాలు నమ్మి మోసపోవద్దని జిల్లాకలెక్టర్ శ్రీ్ధర్ రైతులను కోరారు. కోట మండలం ఉత్తమ నెల్లూరు వద్ద బుధవారం వెంకటేశ్వర్లు అనే రైతు దళారులకు ధాన్యం విక్రయించడాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దళారులు ఏర్పాటు చేసివున్న కాటాను పరిశీలించారు. అంతేకాకుండా ధాన్యం ఎంత ధరకు దళారులు కొనుగోలు చేస్తున్నారన్న విషయాన్ని రైతునడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసివున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని, దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని, ఎవరైనా దళారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే తక్షణమే ఆయా మండల తహశీల్దార్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట గూడూరు సమ్‌కలెక్టర్ నివాస్, తహశీల్దార్ చెన్నయ్య వున్నారు.
తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై గ్రామసభ అడ్డుకున్న స్థానికులు
గందరగోళం
కోట, మార్చి 6: మండలంలోని కొత్తపట్నం పంచాయితీ పరిధిలో కృష్ణపట్నం ఇంటర్‌నేషనల్ లెదర్‌కాంప్లెక్స్ వారు ఏర్పాటు చేయనున్న తోళ్లపరిశ్రమ గ్రామసభను బుధవారం ప్రజలు అడ్డుకోవడమే కాకుండా అధికారులపై తిరగబడి మిరపొడి, ఇసుకతో దాడికి దిగారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత జరిగింది. భారీగా పోలీసులు మొహరించారు. కలెక్టర్ కన్నా ముందుగా గూడూరు సబ్‌కలెక్టర్ నివాస్ సభాస్థలం వద్దకు వచ్చారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా రెచ్చిపోయి మార్గమధ్యలోనే సబ్‌కలెక్టర్ అడ్డుకున్నారు. ఇంతలో కలెక్టర్ శ్రీ్ధర్ అక్కడికి రావడంతో ఆందోళనకారులు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరిశ్రమ మాకొద్దంటూ నినాదాలు చేశారు. దీంతో గూడూరు డిఎస్పీ హనుమంతరావు ఆందోళనకారులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వారు ఆయన మాటలను లెక్కజేయలేదు. ఈ సమయంలో గోవిందుపల్లి జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఒకదశలో విద్యార్థులను ఆందోళన చేయవద్దని అధికారులు కోరినప్పటికీ వారు అధికారుల మాటలను లెక్కచేయలేదు. దీంతో అధికారులు చేసేదిలేక ఒక్కచెట్టు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో చెట్టు వద్ద వున్న ప్రజలకు పరిశ్రమ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతానికి కలిగే ఉపయోగాలగురించి పరిశ్రమ ఎండి వివరిస్తుండగా ఆందోళనకారులు ఒక్కసారిగా కారం, ఇసుకతో అధికారులపై దాడికి దిగారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళనకారులను అధికారుల వద్దకు రానివ్వకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఆందోళనకారులను చెదరకొట్టారు. ఈ సంఘటనలో 8వతరగతి చదువుతున్న నారాయణమ్మ, మరొక విద్యార్థినికి కళ్లలో, ఒంటిపై మిరపొడి పడటంతో వారు కేకలువేస్తూ అస్వస్థతకు గురైనారు. దీంతో స్థానికులు ఆ విద్యార్థునులపై నీళ్లుపోయడంతో వారు సేదతీరారు. ఆ సమయంలో తమ అనుమతిలేకుండా తమ పిల్లలను ఎందుకు ఆందోళన వద్దకు తీసుకొచ్చారని పలువురు ఆందోళనకారులను నిలదీశారు. అంతేకాకుండా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. చివరకు చేసేదిలేక అధికారులు వెనుతిరిగారు. గ్రామసభ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు డిఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర నాయకులు జి విజయకుమార్, జిల్లా కార్యదర్శి అంజిరెడ్డి, బిజెపి నాయకులు పనబాక కోటేశ్వరరావు, మిడతల రమేష్, సత్యన అంబ్రీష్, నవచైతన్య యువజన సంఘం కార్యదర్శి జి బాలక్రిష్ణారెడ్డి, ప్రజాసంఘం నాయకులు లెనిన్ ధనిశెట్టి, గనుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ కెఆర్ దాసరి, టిడిపి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు డి కళ్యాణ్, ఉప్పల ప్రసాద్, వెంకటాద్రి, ఎపిసిఎల్‌సి జిల్లా ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, సిపియం మండల కార్యదర్శి పివి క్రిష్ణయ్య, ఎఐటియుసి, సిపిఐయం, సిఐటియు, కెఎన్‌పిఎస్, ఎఐవైఎఫ్, కులనిర్మూలన పోరాట సమితి నాయకులు, కాలుష్య నివారణ శాఖ ఇఇ మహేష్‌కుమార్, తహశీల్దార్ చెన్నయ్య, వాకాడు, గూడూరు, సూళ్లూరుపేట సిఐలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, వేమారెడ్డి, రత్నయ్య, డివిజన్‌లోని పలువురు ఎస్సైలు, మహిళా పోలీసులు, విద్యార్థులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ బాటను విజయవంతం చేయాలి
- మంత్రి ఆనం పిలుపు
రాపూరు, మార్చి 6 : జిల్లాలో సిఎం పాల్గొననున్న ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన వివరాలను రాపూరులో ఆయన విలేఖర్లకు వివరించారు. ప్రతి ఏటా 26వేల కోట్ల రూపాయల నిధులతో వివిధ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇందిరమ్మబాటలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో మూడు రోజుల పాటు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన మొదటి రోజు సోమశిల హైలెవల్ కెనాల్, టూరిజం పనులను ప్రారంభిస్తారని, గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు శంకుస్థాపన, అనంతరం ఆదూరుపల్లిలో ఎస్సీ బాలుర రెసిడెన్షీయల్ పాఠశాల భవనాలకు శంకుస్థాపన, అనంతరం కండలేరు అతిథిగృహంలో కండలేరు, సోమశిల ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం రాపూరులో నూతనంగా నిర్మించిన బాలుర ఉన్నత పాఠశాల భవనం, ఇంటిగ్రేట్ హాస్టల్ భవనాలతో పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను ఆయన ప్రారంభిస్తారన్నారు. మొదటి రోజు సిఎం పర్యటనలో రాత్రి బస ఇంటిగ్రేట్ హాస్టల్‌లోనే వుంటుందని, విద్యార్థులతో సహపంక్తి భోజనం, ఇష్టాగోష్టి చర్చలు, రాజీవ్ యువకిరణాలపై సమీక్ష వుంటుందన్నారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరు కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరి ధనుంజయరెడ్డి, జెసి లక్ష్మీకాంతం, నెల్లూరు ఆర్డీవో మాధవీలత, పిడి గౌతమి, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్ను బాలకృష్ణారెడ్డి ఉన్నారు.
ఆనంకు ఘనస్వాగతం
హైదరాబాదు నుండి విమానంలో రేణిగుంటకు బుధవారం చేరుకున్న మంత్రి ఆయన రోడ్డు మార్గాన రాపూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పలుశాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్థానిక తెలుగుగంగ అతిథిగృహంలో ఆయన స్థానిక నేతలతో సమావేశమయ్యారు. నూతనంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న చెన్ను రామచంద్రారెడ్డి బాలుర ఉన్నతపాఠశాల భవన సముదాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పాఠశాలలో చిన్న చిన్న మార్పుల చేర్పులపై డి ఇవో మువ్వా రామలింగానికి సూచనలు చేశారు. అనంతరం ఇంటిగ్రేట్ హాస్టల్ భవనాలను పరిశీలించారు. అనంతరం కండలేరు తెలుగుగంగ అతిథిగృహానికి చేరుకున్న ఆయన అక్కడే పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వీరి వెంట పంచాయతీరాజ్ ఎస్‌ఇ శ్రీరాములు, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్ను బాలకృష్ణారెడ్డి, ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు డి ఎస్పీ మహేంద్రనాయక్, చిట్టిబాబు, ఈద్గా కమిటీ చైర్మన్ ముక్తియార్, మాజీ ఎంపిపి బండి కృష్ణారెడ్డి, సూర్యప్రకాష్, రాపూరు సహకార సంఘ అధ్యక్షులు చెన్ను భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరుణామయి విదేశీయానం
రాపూరు, మార్చి 6 : అమెరికా దేశ పర్యటనకు వెళుతున్న భగవతి కరుణామయి విజయేశ్వరిదేవికి పలు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం పెంచలకోనలోని కరుణామయి ఆశ్రమం నుంచి బయలుదేరిన విజయేశ్వరి దేవికి పలువురు ఘన వీడ్కోలు పలికి, అమెరికా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం విజయేశ్వరి దేవి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. వీరి వెంట ఆశ్రమ నిర్వాహకులు రామ్మోహన్, రేవతమ్మ ఉన్నారు.
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
కోవూరు, మార్చి 6 : మండలంలోని టి ఎన్ సి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇనమడుగు కళాశాలలో బుధవారం మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. టి ఎన్‌సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 404 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 371మంది హాజరయ్యారని, 33మంది గైర్హాజరైనట్లు చీఫ్ ఇన్విజిలేటర్ రాజగోపాల్ తెలిపారు. ఇనమడుగులో 159మంది హాజరుకావాల్సి ఉండగా 145మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు.
టిడిపిలోనే మైనార్టీలకు పెద్దపీట
కోవూరు, మార్చి 6 : రాష్ట్రంలో మైనార్టీలకు టిడిపి హయాంలోనే పెద్దపీట వేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం పట్టణ కార్యాలయంలో టిడిపి మండల మైనార్టీ సెల్ ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కోవూరు అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, సతీష్, వెంకట రమణమ్మ, మైనార్టీ నాయకులు జిలానీబేగం, మస్తాన్, నజీర్, ఖాదర్‌బాషా, టిడిపి నాయకులు వీరాస్వామి, సుకుమార్, సుజన తదితరులు పాల్గొన్నారు.
పేటలో భారీ వర్షం
- రైతు గుండె చెరువు
నాయుడుపేట, మార్చి 6 : నాయుడుపేట మండల పరిధిలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి మబ్బులతో ఉన్న వాతావరణ సాయంత్రానికి చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ అకాల వానకు అన్నదాత గుండె చెరువైంది. మండలపరిధిలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట కల్లాల మీద తడిసి ముద్దయ్యింది. దీనిని ఆసరాగా తీసుకుని దళారులు ధాన్యం ధరలు తగ్గించే అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిరప, పుచ్చ తదితర పంటలు కూడా చాలా వరకు నష్టానికి గురైంది. వెయ్యిమంది కిరణ్‌లు, చిరంజీవిలు కలిసినా
వైఎస్‌ఆర్‌సిపి విజయాన్ని ఆపలేరు
* కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవు : కాకాణి
ముత్తుకూరు, మార్చి 6 : వెయ్యిమంది కిరణ్‌లు, చిరంజీవిలు కలిసి వచ్చినా వైఎస్‌ఆర్‌సిపి విజయాన్ని ఆపలేరని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. గడపగడపకు వైఎస్‌ఆర్‌సిపి ప్రారంభించిన దీవెన యాత్ర బుధవారం మండలంలోని మామిడిపూడి, నేలటూరు, నేలటూరు పాళెంలో నిర్వహించారు. కాకాణి ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాకాణి గడపగడపకు వెళ్లి పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ట్ర చరిత్రలో మహానేత వైఎస్ లాంటి నేతను ఇంతవరకు చూడలేదన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజల బాధలు తెలియవని, కనీసం తెలుగు మాట్లాడడం కూడా రాదన్నారు. వైఎస్ పథకాలను నీరుగార్చిన ఘనత కిరణ్‌కే దక్కుతుందన్నారు. ప్రజలంతా ఏకమై వైఎస్ జనగ్‌కు దీవెనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఈపూరు కోటారెడ్డి, యనాటి శశిధర్‌రెడ్డి, దువ్వూరు కరుణాకర్‌రెడ్డి, దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, యర్రం వేణుయాదవ్, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.