Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొనసాగుతున్న వస్త్ర వ్యాపారుల రిలే దీక్షలు

$
0
0

నెల్లూరు సిటీ, మార్చి 12: వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను నిరసిస్తూ వస్తవ్య్రాపారులు చేపట్టిన నిరవధిక బంద్ ఐదవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక వస్తవ్య్రాపారుల సంఘం అధ్యక్షులు కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చలువాది నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాసులు, కిషోర్, తదితరుల నేతృత్వంలో నగరంలోని గాంధీబొమ్మ కూడలి వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో స్థానికంగా బంద్‌లో పాల్గొనని దుకాణాల వద్ద వ్యాపారులు ధర్నా చేపట్టారు. దీంతో సదరు దుకాణదారులు ఎట్టకేలకు తోక ముడవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ వస్తవ్య్రాపార నేతలు హెచ్చరిస్తున్నారు. వస్త్రాలను సెన్సిటీవ్ కమాడెటీస్ కింద పరిగణించడం వల్ల కేవలం పదిశాతం మంది బడా వ్యాపారులకు మాత్రమే ప్రయోజనం ఉంటుందన్నారు. మిగిలిన తొంభైశాతం మంది చిన్న, మధ్యతరగతి వస్తవ్య్రాపారులు తమ దుకాణాలు మూసి వేసి జీవనోపాధి కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటారని వాపోయారు. పాలకులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇదిలాఉంటే ఇప్పటికే బిజెపి వస్తవ్య్రాపారుల సమ్మెకు మద్దతు పలకడం తెలిసిందే. తాజాగా తెలుగుదేశంపార్టీ నాయకులు కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వస్తవ్య్రాపారుల బంద్‌కు బాసటగా నిలిచారు.

ఉత్తుత్తి బిల్లులతో
ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు హాంఫట్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 13: ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆర్‌ఎంఎస్‌ఏ (రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణా అభియాన్) కింద సాలుసరి మంజూరవుతోన్న ఏభై వేల రూపాయల నిధులు దుర్వినియోగవుతున్నట్టు తెలియవచ్చింది. 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మార్గదర్శక ఉత్తర్వులు వెలువడడంలోనే తీవ్రజాప్యం జరిగింది. ఎంచక్కా ప్రధానోపాధ్యాయులు ఈ నిధులు డ్రా చేసుకుని నకిలీ బిల్లుల్ని నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుఅన్ని ఉన్నత పాఠశాలల పరిస్థితి ఇదే మాదిరి కనిపిస్తోంది. ప్రధానోపాధ్యాయులతో సహా మరో ఇద్దరు బిఇడి అసిస్టెంట్లను కూడా స్కూల్ స్థాయిలో ఈ నిధులతో కొనుగోళ్లకు సంబంధించిన కమిటీలో సభ్యత్వం కల్పించారు. అయితే కొన్ని స్కూళ్లలో ముగ్గురు ఉపాధ్యాయులు కలిపి తిలాపాపం తలా పిడికెడు అనేలా కొనసాగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులే అందినకాడకి దిగమింగుతుండటంతో సైన్స్, గణితం అయ్యోర్లకు కంటగింపుగా మారుతోంది. ఈతరహాలో జిల్లాలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ తీరుపై సహచర సహచర ఉపాధ్యాయులు పరోక్షంగా ఆరోపణలు సంధిస్తున్నారు.
ఏదేమైనా బోధనాపరికరాలు కొనుగోలు చేయకుండానే నిధుల గోల్‌మాల్ జరిగిపోతున్నా స్పందించే నాథుడే కరవు. ఒకవేళ అక్కడక్కడా కొనుగోలు చేసినా దాదాపుగా నాశిరకం, నాణ్యతా ప్రమాణాలు సరిలేకపోవడంతో వాటి మార్కెట్ విలువకు రికార్డుల్లో నమోదు చేస్తున్న రూపాయలకు వ్యత్యాసం ఎక్కువగానే ఉంటోంది. స్కూళ్లకు తాగునీటి సరఫరా నిమిత్తం చెల్లించాల్సిన బిల్లులు, విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, ఇంటర్‌నెట్ చార్జీల కింద 15వేల రూపాయలకు ఈ నిధుల్లో వాటా ఉంది. అదేవిధంగా గ్రంధాలయ పుస్తకాల కోసం పదివేల రూపాయలు, చరిత్ర, డ్రాయింగ్ వంటి బోధనా పరికరాలు, పెయింటింగ్ మెటీరియల్స్, మ్యాప్‌ల కోసం ఆరువేల రూపాయలు, స్పోర్ట్స్‌కు సంబంధించి నాలుగువేల రూపాయలు, సైన్స్, గణితం ల్యాబ్ ఐటమ్స్ కోసం 15వేల రూపాయల వంతున నిధుల్లో భాగస్వామ్యం కల్పించారు. సైన్స్, గణితం ప్రయోగశాలల పరికరాలకు సంబంధించి రాష్టస్థ్రాయిలోనే వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఓ పేరొందిన సంస్థను సూచిస్తున్నా ‘ఎందుకో..?’ బెడిసి కొట్టడంతో ఈ నిధులకు సంబంధించి కొనుగోలు నిలిచిపోయింది. గ్రంథాలయానికి సంబంధించిన పుస్తక సంపద కొనుగోలుకు ఎలాంటి అభ్యంతరాల్లేవు. ఎన్ని స్కూళ్లలో గ్రంధాలయాలు ఉండి, విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఏదేమైనా కొనుగోళ్ల నుంచి ఆ తరువాత బిల్లుల్ని సరిచూసే ఆడిటింగ్ ప్రక్రియ వరకు అంతా అనుమానాస్పదంగానే వ్యవహారాలు జరుగుతున్నాయి. కాగా, చాలా స్కూళ్లకు ఇంతవరకు తాగునీటి సౌకర్యమే లేదు. అలాంటప్పుడు వాటిని సరఫరా చేసినందుకు బిల్లులు కూడా చెల్లించినట్లుగా రికార్డులు నమోదవుతుండటమే వింత గొలుపుతోన్న పరిణామం. తాగునీరు, పారిశుద్ధ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్ అధికార్లదేనంటూ విద్యాశాఖ యంత్రాంగం తప్పించుకుంటోంది.

డిప్యూటీ డిఇఓలదే బాధ్యత: డిఇఓ
ఆర్‌ఎంఎస్‌ఏ నిధులకు సంబంధించి పరిశీలన బాధ్యత డిప్యూటీ డిఇఓలదే. వారే వీటికి సంబంధించిన కొనుగోళ్లు సరిగ్గా సాగాయా, ఆయా వస్తుసామగ్రి స్కూళ్లలో ఉందా లేదా అనేది డిప్యూటీ డిఇఓలే చూడాలి జిల్లాలో జలమణి పథకం అమలు తీరులో చతికిలబడింది. ఈ పథకం అమలై ఉంటే దాదాపుఅన్ని స్కూళ్లలోనూ విద్యార్థులకు దాహార్తి సమస్య తీరి ఉండేదే అని డిఇఓ రామలింగం అభిప్రాయపడ్డారు..
పక్కా సమాచారం మేరకు ఆర్టీఓ కార్యాలయంపై
ఎసిబి సోదాలు
నెల్లూరు అర్బన్, మార్చి 13: అర్జీదారుల నుండి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని తమకు వచ్చిన సమాచారం మేరకు నెల్లూరు ఆర్‌టిఏ కార్యాలయంపై దాడులు నిర్వహించామని ఎసిబి డిఎస్పీ భాస్కర్‌రావు చెప్పారు. బుధవారం నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయంపై దాడి చేసి లక్షా 79వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 13మంది ఏజెంట్లను అదుపులోకితీసుకున్నారు.(ప్రధాన వార్త మెయన్ ఎడిషన్‌లో) బుధవారం ఆయన సంఘటనా స్థలంలో విలేఖరులతో మాట్లాడారు. కార్యాలయం లోనికి ఏజెంట్ల అనుమతి లేకపోయినప్పటికీ అధికారులు, సిబ్బంది వారి నుంచి పనులు చేయించుకుంటూ మామూళ్లు పుచ్చుకుంటున్నారని తెలిసిందన్నారు. డ్రైవింగ్ లైసెన్సుకు 1500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. కార్యాలయంపై నిఘా తాము నిర్వహించిన దాడుల్లో 15 మంది ఏజెంట్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి లక్షా 59వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యాలయంలో మరో 15వేల రూపాయల నగదు దొరికిందన్నారు. ఏజెంట్లను విచారిస్తే వారి చెప్పే కారణాలు సరిగ్గా లేవన్నారు. ఆర్‌టివోతోపాటు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, ఏజెంట్లపై కేసు నమోదుచేశామన్నారు. పూర్తిగా విచారణ చేపడుతున్నాం.
ఏజెంట్లను ప్రోత్సహించడం లేదు: ఆర్‌టివో
తాము ఏజెంట్లను ప్రోత్సహించడం లేదని ఆర్‌టివో వరప్రసాద్ తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు యజమాని వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, లైసెన్సు కూడా వారి ఇంటికే పోస్టు ద్వారా పంపిస్తున్నామన్నారు. ప్రజలు ఏజెంట్లను సంప్రదించకుండా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ పెట్టామని, రోజుకు 200 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. తమ కార్యాలయంలో సిబ్బంది నుండి అసంతృప్తి కనిపిస్తే నేరుగా తనకు కానీ, డిటిసికి కానీ ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఏజెంట్లను అనుమతించబోమన్నారు. ఈ దాడుల్లో ఏసిబి ఇన్‌స్పెక్టర్లు బి సుధాకర్‌రెడ్డి, కె వెంకటేశ్వర్లు, టివి శ్రీనివాసరావు, చంద్రవౌళి, సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో 50 ఆధార్ కేంద్రాలు ఏర్పాటు:జెసి
ఇందుకూరుపేట, మార్చి 13: కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్‌ల్లలో 50 ఆధార్ కేంద్రాలను ఈనెల 16నుంచి 25లోగా ప్రారంభిస్తామని జెసి లక్ష్మీకాంతం తెలిపారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో అధికారులతో మాట్లాడుతూ 16న 17 కేంద్రాలను నెలకొల్పుతామన్నారు. ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఆ ప్రాంతం ఆధార్ కేంద్రానే్న వినియోగించుకోవాలన్నారు. ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. గతంలో ఫోటోలు తీసుకున్న వారు మరలా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. అలా ఎవరైనా వస్తే మొదటి గుర్తింపు కార్డు తర్వాతి కార్డు రద్దవుతుందన్నారు. గతంలో ఫోటోలు తీసుకుని ఆధార్‌కార్డులు రానివారు మీ సేవాకేంద్రాల్లో స్టేటస్ చూసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ మాధవీలత, జిల్లాలోని ఆధార్ కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిసిసిబి వ్యాపార లావాదేవీలు 500 కోట్లకు పెంచుదాం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 13: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వ్యాపార లావాదేవీలను ఐదువందల కోట్ల రూపాయల వరకు పెంచడం ద్వారా ప్రభుత్వ నిధులు ముమ్మరంగా సాధిద్దామని నూతన పాలక మండలి ప్రతినబూనింది. బుధవారం పాలక మండలి తొలి బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీలు 85 కోట్ల రూపాయల వరకు ఉండటంతో సి గ్రేడ్‌కే పరిమితమైందన్నారు. ఈ మొత్తాన్ని ఐదువందల కోట్ల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేంద్ర చేనేత, జౌళిశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ప్రభృతుల సహాయ సహకారాలు పొందాలని నిశ్చయించుకున్నారు. డిసిసిబికి ఆప్కాబ్ డైరెక్టర్ హోదా ఉండటంతో 250 కోట్ల బడ్జెట్ అటునుంచి సాధిద్దామని కూడా తీర్మానించుకున్నారు. జిల్లాలో డైరెక్టర్లు ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో క్యాష్ కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అన్ని సొసైటీల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించాలని తీర్మానించారు. పక్షం రోజుల తరువాత ఈ నెల 28న మళ్లీ బోర్డు మీటింగ్, అదే రోజు సాయంత్రం జనరల్‌బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకోవడం విశేషం. ఏదేమైనా బ్యాంక్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని మెట్టుకూరితోపాటు డైరెక్టర్లంతా అభిప్రాయపడ్డారు. సమష్టిగా కృషి చేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేద్దామన్నారు. సమావేశంలో బ్యాంక్ ఉప చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహనరెడ్డితోపాటు జనరల్ మేనేజర్ రమణారెడ్డి, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.

రెండు ఆటోలు ఢీకొని ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
గూడూరు, మార్చి 13: అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఆటో డ్రైవర్ మద్యంమత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళళకు తీవ్ర గాయాలైనాయి. చిల్లకూరు మండలం పిడతల పూడి గ్రామానికి చెందిన బుజ్జమ్మ, అంకమ్మ తమ బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో గూడూరులోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్సకోసం ఆటోలో వస్తుండంగా బుధవారం స్థానిక ఆసుపత్రి రోడ్డులోని రమేష్ బేకరీ ఎదురుగా మద్యం సేవించి ఆటో నడుపుతున్న మరో వ్యక్తి వీరి ఆటోను ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న బుజ్జమ్మ, అంకమ్మలకు తీవ్ర గాయాలైనాయి. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఒకరికి 30 కుట్లు, మరొకరికి పది కుట్లు పడ్డాయి. ఈ మేరకు ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పక్కాగా జనాభా లెక్కలు సేకరించాలి
గూడూరు, మార్చి 13: జనాభా లెక్కలను పక్కాగా సేకరించాలని, ఇందుకు అవసరమైన అన్ని వివరాలను ప్రతి ఇంటికి వెళ్లి వారి స్థితి గతలను సేకరణలో నమోదు చేయాలని జిల్లా సెన్సన్ ఇన్‌చార్జీ వివి సత్యనారాయణ కోరారు. బుధవారం స్థానిక షాదీ మంజిల్‌లో అంగనవాడీ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో జనాభా లెక్కల సేకరణకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సేకరణలో సమాచారం పక్కాగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సర్వే సక్రమంగా నిర్వహించి వివరాలను పక్కగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జిసి సుశీలమ్మ, అంగనవాడీ కార్యకర్తలు, మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

లెదర్ పార్కును మార్చాలి
ఇందుకూరు పేట, మార్చి 13: జిల్లాలోని కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని నిర్మించ తలపెట్టిన కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ పార్కును మరో చోటుకు మార్చాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థరాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవి కృష్ణయ్య కోరారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 530 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ పరిశ్రమకు కేటాయించిందన్నారు. ఈభూమిలో నీటి నిల్వలు అధికంగా ఉండడంతో ఇక్కడున్న సొనకాలువల ద్వారా 1500 మంది సన్నకారు రైతులు రెండువేల ఎకరాల మాగాణి సాగుచేస్తున్నారన్నారు. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం గ్రామాలను ఖాళీ చేయించడం పేదల కడుపుకొట్టడమేనన్నారు. సొనలను అభివృద్ధి చేసి మాగాణిని బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలన్నారు. గ్రామలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్ శివశంకర్ డివిఇ దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.

వేధింపులు ఆపాలంటూ ధర్నా
ఇందుకూరుపేట, మార్చి 13: 108 ఉద్యోగులపై అధికారులు వేధింపులు ఆపి తమకు న్యాయం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 130 మంది పని చేస్తున్నామన్నారు. 30వాహనాలు ఉండాల్సి ఉండగా 25 వాహనాలు నడుస్తున్నాయన్నారు. మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిన వాహనాలను ఒప్పందం ప్రకారం రద్దుచేసి కొత్తవి ఏర్పాటుచేయక పాతవాటినే తిప్పుతున్నారన్నారు. వాహనాల్లో అత్యవసర వైద్య పరీక్షలు చేసే పరికరాలు లేవన్నారు. 300 రకాల మందులకు గాను 103రకాల మందులున్నాయన్నారు. దీనివల్ల వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం విఫలం అవుతోందన్నారు. జిల్లాలో ఉద్యోగులను అవాస్తవ ఆరోపణలో విచారణ పేరుతో అధికారులు కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎఓ మధుసూదన్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఐ నగరకార్యదర్శి మహేష్‌బాబు ఆంజనేయులు లీలామోహన్ రాజేష్ నాగరాజు నాగేంద్ర తిరుమల పాల్గొన్నారు.

న్యాయం చేయాలంటూ వ్యాపారుల ధర్నా
ఇందుకూరుపేట, మార్చి 13: నెల్లూరు హరనాథపురం వద్ద రోడ్డు విస్తరణలో తమ షాపులు అధికారులు కూల్చేశారని ఆ ప్రాంతంలో చేపల వ్యాపారులు బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీంతో తాము ఉపాధి కోల్పోయామన్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ప్రత్యామ్నాయంగా మరో చేపల మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎఓ మధుసూధన్‌కు వినతిపత్రం ఇచ్చారు.

భూసమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు : జెసి
అల్లూరు, మార్చి 13:గ్రామాల్లోని భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. బుధవారం మండలంలోని ఇందుపూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పాస్‌బుక్‌లు, భూమి సంబంధించిన అడంగల్, పేరుమార్పులు, తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు సదస్సులు ఏర్పాటుచేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. మండలంలోని ఈనెల చివరి వరకు రెవెన్యూ సదస్సులు ఆయా గ్రామాలలో జరుగుతాయని ఆయన వివరించారు. గిరిజనులకు అంత్యోదయ కార్డులు ఆయన అందచేశారు. 9మంది పాస్‌బుక్‌లు, కొంతమందికి అడంగల్ ఇచ్చారు. శ్మశానానికి స్థలం కేటాయించాలని స్థానిక దళితులు జెసి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గిరిజన కాలనీ, ఇందుపూరు పల్లెపాలెం ఇళ్ళస్థలాలను ఆయన పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆయనతోపాటు తహశీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి, వి ఆర్ ఓలు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తనిఖీ

అల్లూరు, మార్చి 13: ఇస్కపల్లి పిహెచ్‌సి ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం క్లస్టర్ అధికారి డాక్టర్ రఫీక్ అహ్మద్ సందర్శించారు. అంతేకాకుండా రాయిపేట గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధినిరోదక టీకాల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా వున్నందున వ్యాధి నిరోదక టీకాలు చాలా అవసరం అన్నారు. అంతేకాకుండా సిబ్బంది ప్రజలకుఅందుబాటులో వుండి ఆరోగ్యసేవలు అందించాలని ఆయన కోరారు. 5సంవత్సరాల లోపు చిన్నారులకు విటమిన్ ఏ ట్లాబెట్‌లు పంపిణీ చేయాలని తెలిపారు. మిటమిన్ లోపం ఏ వున్నవారికి అంధత్వం వచ్చే అవకాశాలువున్నాయని ఈమాత్రలు తప్పనిసరిగా వాడాలని ఆయన వివరించారు. ఇప్పటికే ఇస్కపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా 3939, దగదర్తి 1202, రామతీర్ధం 2394, విడవలూరు 2422మందికి ఈమందులు అందించాల్సిన అవసరంవుందన్నారు. ఈకార్యక్రమంలో క్లస్టర్ హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్‌రావు, సూపర్‌వైజర్లు కృష్ణయ్య, కుమారి తదితరులు పాల్గొన్నారు.

కాలువ ఆక్రమణలు తొలగించండి
కొండాపురం,మార్చి13: తమగ్రామంలోని ఆక్రమణలకు గురైన కాలువలను సర్వే చేయించి వాటిని ఆక్రమణల చెరనుండి తొలగించాలని మండలంలోని సాయిపేట గ్రామ ప్రజలు మండల తహశీల్దార్ వి. లావణ్యను కోరారు. బుధవారం మండలంలోని సాయిపేటగ్రామంలో రెవిన్యూ సదస్సు జరిగింది. ఈ సంధర్భంగా సాయిపేట గ్రామస్ధులు తమ గ్రామంలో ఉన్న ఊటకాలువ ఆక్రమణకు గురైందని, గతంలో 50 లింకుల వెడల్పు ఉన్న ఈ కాలువ ప్రస్తుతం 5 లింకులు మాత్రమే వుందని ఇందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తహశీల్ధార్‌కు తెలిపారు. పొలిమేర దగ్గర నుండి పొలాలకు వెళ్ళే రోడ్డుకూడా ఆక్రమణలకు గురైందని వీటిని ఆక్రమణలనుండి కాపాడాలని కోరారు. దీనికి స్పందించిన తహశీల్ధార్ సర్వేయర్‌తో విచారణ జరిపించి ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఈ సదస్సులో 73 అర్జీలు రాగా అందులో అడంగల్‌లో పేరుమార్పు కోరుతూ 41,పట్టాదార్ పాస్ పుస్తకాలకు 4, భూముల సర్వే కోసం 6తోపాటు వివిధ సమస్యలపై మిగిలిన అర్జీలు వచ్చాయని ఆర్ ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌తో పాటు ఆర్ ఐ కోటేశ్వరరావు, విర్వోలు జనార్ధన్, మురళి, గోపాలరావు, సర్వేయర్ శ్రీనివాసులు, ఏపి ఓ హజరత్, వెలుగు సిసి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యను పరిష్కరించండి
కొండాపురం, మార్చి 13 : మండలంలోని సాయిపేట గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని తహశీల్ధార్ వి.లావణ్యను ఆ గ్రామస్థులు కోరారు. బుధవారం ఆమె స్ధానిక ఆర్‌డబ్ల్యు ఎస్ ఏ మనోహర్ బాబుతో కలసి గ్రామంలోని తాగునీటి వనరులను పరిశీలించారు. ఈ సంధర్భంగా గ్రామస్తులు గ్రామంలోని తాగునీటి సమస్యగురించి ఆమెకు వివరించారు. గతంలో ఇక్కడ వున్న బావి పూడిపోయిందని, తరువాత వేసిన బోరుకూడా విఫలం అయిందని ఇందువల్ల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రస్తుతం కొత్తబోరు వేయడంతో పాటు, బావిలో పూడిక తీయించాలని లేకుంటే వేసవి కాలంలో సుమారు 7వందల కుటుంబాలు తాగునీటికి ఇబ్బంది పడతాయన్నారు. ఇందుకు స్పందించిన ఆమె పంచాయతీ నిధులతో పనులు చేపడతామని, అవి చాలకుంటే జిల్లా కలెక్టర్‌కు సమస్యను నివేదించి వీలైనంత త్వరగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈసంధర్భంగా కొండాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ రామమూర్తి నాయుడు తదితరులు ఉన్నారు.

పోలీస్ స్టేషన్‌కు చేరిన టెన్త్ ప్రశ్నా పత్రాలు
కొండాపురం, మార్చి 13: త్వరలో జరగనున్న పదవతరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు బుధవారం కొండాపురం పోలీస్ స్టేషన్‌కు చేరాయి. ఈ సంధర్భంగా మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో మండలంలోని సాయిపేట, కొండాపురం, కొమ్మి, మర్రిగుంట, చింతలదేవి, తూర్పుయర్రబల్లి, నేకునాంపేట గ్రామాలలో వున్న జడ్‌పి పాఠశాల విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్‌కు బుధవారం చేరాయన్నారు. టెన్త్ పరీక్షలకు డిపార్ట్‌మెంటల్ అధికారిగా టి.రఘురాం, పరీక్షల ఛీఫ్‌గా మాలకొండయ్య నియమితులయ్యారని, రూట్ అధికారులగా తాను, వరికుంటపాడు మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు నియమితులైనట్లు తెలిపారు.

నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు పట్ల హర్షం
కొండాపురం, మార్చి13 : ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 2నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కావడం పట్ల ఎస్‌టియు రాష్ట్ర కన్వీనర్ జి.క్రిష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కొండాపురంలో మాట్లాడుతూ ఎస్‌టియు చేపట్టిన ఉద్యమం ఫలితంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఈ ఇంక్రిమెంట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.తమ ఉద్యమం ఫలితంగా మిగిలిన ఉపాధ్యాయుల లాగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా ఇవి మంజూరు కావడం ఎంతో ఆనందగా వుందన్నారు. వారికి హెల్త్ కార్డులు కడా మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సంధర్భంగా కొండాపురం మండల ఎస్‌టియు అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి రమేష్, ఆర్ధిక కార్యదర్శి బి.శ్రీనివాసులు, నేతలు సంజీవ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను నిరసిస్తూ వస్తవ్య్రాపారులు చేపట్టిన నిరవధిక బంద్ ఐదవ రోజుకు
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>