* విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో తగ్గుతాయి. రక్తనాళాల్లో సమస్యలను తొలగించడంలో సాయపడుతుంది.
* కీళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు రాగి రొట్టెలు, రాగి సంకటి, రాగి జావ వంటివి తరచూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* ఉదయం వేళ టిఫిన్లకు బదులు పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలను నానబెట్టి మొలకలు తింటే విటమిన్లు, ఖనిజాలు దండిగా లభిస్తాయి. సి- విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మరసాన్ని మొలకలపై చల్లి తింటే రుచికరంగా ఉంటాయి.
* చిలగడ దుంపలో సమృద్ధిగా లభించే బీటా కెరొటిన్ క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది. చిలగడ దుంపలను కాల్చుకుని లేదా ఉడకబెట్టి తిన్నా శరీరానికి ఉత్తేజం లభిస్తుంది.
* బాదం పప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కాలరీలు తక్కువగా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున మానసిక, శారీరక శక్తి అధికమవుతుంది.
* విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది.
english title:
idia
Date:
Saturday, March 16, 2013