రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ బాత్‌రూమ్‌లో ఓ విద్యార్థిని ప్రసవ వేదన అనుభవించి మగ బిడ్డను ప్రసవించింది. పదిహేడు సంవత్సరాల ఈ విద్యార్థిని తొమ్మిది మాసాల పాటు తన గర్భాన్ని ఎవరికంటా పడకండా ఎలా దాచిందో ఆ దేవుడికే ఎరుక! అందుకనే, ఆ పిల్ల సంగతి అటు పెట్టి- గవర్నమెంట్ స్కూల్ అధికారులు తక్షణం ఆ స్కూల్ హాస్టల్ వార్డెన్‌ని ఉద్యోగం లోంచి తొలగించారు. ప్రిన్సిపాల్‌ని పిలిచి - ‘‘అయ్యా! తమరు విధులను ప్రక్కకు పెట్టి కుర్చీ దిగండి’’ అంటూ వెంటనే తప్పించారు.
విద్యార్థిని బాత్‌రూమ్‌లో ఎంతటి పురిటినొప్పుల బాధకు గురైందోగానీ- భూమీమద పడ్డ బిడ్డ ‘క్యార్’మనగానే సహచర విద్యార్థినులు అటు పరుగులు తీశారు. ఈ అమ్మాయి గార్డియన్- ఆమె తాతగారు. తండ్రి కూడా లేడు. తల్లీబిడ్డలకు వెంటనే వైద్య సహాయం అందించి తాతతో పంపించారు గానీ, మరుసటి రోజునే పురిటికందు మరణించింది. ఆ విద్యార్థిని లాడ్నూ గ్రామానికి చెందిన పేద కుటుంబం నుంచి వచ్చింది. చదువుకునే వయసులో గర్భం దాల్చింది. శిశువు మరణించడంతో ఆమెకు విషాదం మిగిలింది. విధి బలీయమా? పెద్దల నిర్లక్ష్యమా? ఏది కారణం..?
ట్రాఫిక్ రద్దీ మీద పన్ను!
పన్నులు అదనాలు, సర్‌ఛార్జీలు పైపెచ్చు వేయడం అన్నది- మన ప్రభుత్వాలకున్న సరిపాత కొత్త హక్కు. ఏ అదనపు ఛార్జీనైనా వినియోగదారుడి నెత్తిమీద, సామాన్యుడి సం సారం మీద వేయడం మామూలే. ఇక ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోడం కోసం- ప్రభుత్వం వాహన చోదకుల మీద అదనపు పన్ను వేయాలని ఆలోచిస్తున్నది.
బాగా కిక్కిరిసిన చోట్ల- అడుగు పెట్టలేని ట్రాఫిక్ జామ్స్ ఏర్పడే చోట- మనం కారో, మోటారు సైకిలో వేసుకుని వెళ్తే- అలా వెళ్లినందుకు డబ్బు కట్టాలి. అది ఫైన్ కాదు. దాన్ని ‘కంజెషన్ టాక్సు’ అంటారు. ఏది ఏమయితేనేం? డబ్బులు కట్టాలి లేదా రద్దీలేని మార్గాలను ఎంచుకొని పోవాలి. డిమాండ్ వున్న పార్కింగ్ స్థలాల్లో కూడా మన బండి పెట్టుకుంటే- రద్దీసుంకం ముక్కు పిండి వసూలు చేస్తారు. అంటే- యిలా రద్దీలేకుండా చేస్తారుట. మనం సాధారణంగా ‘పీక్ అవర్స్’ని తప్పించుకున్నట్లే రద్దీ జాగాల్నీ, రోడ్లనీ కూడా- ‘తప్పించుకోవడం’ చెయ్యాలిట. వారేవా..! పన్నుల పాలసీ జిందాబాద్..!
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ బాత్‌రూమ్‌లో
english title:
veeraji
Date:
Saturday, March 16, 2013