హైదరాబాద్, మార్చి 18:అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత సభను వాయిదా వేసి బిఎసి సమావేశం నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, నిబంధనలు కూడా అలానే ఉన్నాయని కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్టు టిడిపి ఎమ్మెల్యేలు తెలిపారు. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మాట్లాడం, చర్చించడం జరిగిందని శాసన సభాపక్షం ఉప నాయకుడు పి అశోకగజపతిరాజు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, లింగారెడ్డి సోమవారం టిడిఎల్‌పిలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. బడ్జెట్ ప్రసంగం ముగియగానే సభను వాయిదా వేసి బిఎసి సమావేశం నిర్వహిస్తారని, ఈ సమావేశంలోనే బడ్జెట్‌పై ఏ పార్టీ సభ్యులకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయిస్తారని తెలిపారు. కానీ అలాంటిదేమీ జరగలేదని టిడిపి ఎమ్మెల్యేలు వివరించారు. అదే విధంగా వ్యవసాయ బడ్జెట్ అని ముందుగా చెప్పారని, పుస్తకాల్లో కూడా అలానే ఉందని కానీ సభలో మాత్రం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక అని చదివారని, తెలిపారు.
బడ్జెట్ ప్రసంగం ముగియడంతో తాము వాకౌట్ చేశామని, కానీ ప్రసంగం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి చర్చించడం, జరుగుతూనే ఉందని, ఇదేం పద్దతని ప్రశ్నించారు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత సభను
english title:
prevelege
Date:
Tuesday, March 19, 2013