హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2013-14 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌పై శాసనమండలిలో వాగ్వాదం జరిగింది. సోమవారం శాసనమండలి ప్రారంభమైన వెంటనే తొలుత పిడిఎఫ్ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ బడ్జెట్‌ను 10గంటల 26 నిమిషాలకే ఎందుకు ప్రవేశపెడుతున్నారని ప్రశ్నించడం ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ ఇస్రో లాంటి సంస్ధలు కూడా అంతరిక్ష నౌకలను ప్రయోగించేటప్పుడు శుభ ముహుర్తాన్ని ఎంచుకుంటాయన్నారు. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా మరో ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ సభ్యులకు బడ్జెట్ గురించి ముందుగా తెలియచేసే ఉంటే బాగుండేదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర రెడ్డి మాట్లాడుతూ మేధోవీకరణ ఎక్కువైనట్లు అర్ధంవచ్చేలా వ్యాఖ్యానించారు. దీంతో నాగేశ్వర్ ఆగ్రహం చెంది ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. సభ్యులకు ఉన్న ప్రశ్నించే హక్కును హరించే విధంగా ఎవరూ మాట్లాడరాదన్నారు. ఈ సందర్భంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి మేధోవీకరణ ఎక్కువైనట్లు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం మంత్రి సి రామచంద్రయ్య మాట్లాడుతూ గవర్నర్ ఆమోదంతోనే నిర్దేశించిన సమయంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందన్నారు. అనంతరం చైర్మన్ చక్రపాణి జోక్యం చేసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంపై వివాదం అక్కర్లేదని శాంతింపచేశారు.
వివిధ శాఖలకు గత బడ్జెట్‌లో,
2013-14 బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు
శాఖలు గత తాజా
బడ్జెట్‌లో బడ్జెట్‌లో
జీతాలు 30,598 34,997
వడ్డీ చెల్లింపులు 12,226 14,519
పింఛనులు 11,480 14,209
సబ్సిడీలు 12,692 13,301
(బియ్యం) 3,000 3,000
(విద్యుత్) 5,500 5,700
జలయజ్ఞం 15,013 13,804
పంచాయితీ, గ్రామీణాభివృద్ధి 5,885 6,914
పురపాలక 4,876 5,137
విద్య 4,801 4,982
బిసి సంక్షేమం 2,656 3,632
సాంఘిక సంక్షేమం 1,719 3,077
మహిళా సంక్షేమం 2,282 2,702
గిరిజన సంక్షేమం 1,013 1,516
మైనార్టీ సంక్షేమం 482 1,020
యువజనశాఖ 343 489
సంక్షేమ పింఛన్లు 1,932 2,280
స్కాలర్‌షిప్పులు 3,820 5,533
వడ్డీలేని రుణాలు 1,075 1,300
ప్రత్యేక అభివృద్ధి నిధి 600 600
రోడ్ల నిర్మాణం 3,210 3,038
వైద్య ఆరోగ్యం 2,364 2,580
వ్యవసాయ అనుబంధ రంగాలు 6,939
వ్యవసాయ ప్రణాళిక 25,962