హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర జనాభా 8,46,65,533 మాత్రమే. 1961లో రాష్ట్ర జనాభా 3,59,83,447 కాగా గత 50 ఏళ్లలో పెరిగిన జనాభా దాదాపు ఐదు కోట్లు మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అపరమితంగా ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం జనాభా పెరుగుదల గణనీయంగా పెరిగింది. 2011 నాటి ప్రాధమిక అంచనాల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు కాగా రాష్ట్ర జనాభా 8.46 కోట్లు మాత్రమే. 1961 నాటికి భారతదేశ జనాభా 43.923 కోట్లు ఉంది. అపుడు రాష్ట్ర జనాభా 3.59 కోట్లు మాత్రమే. 1971 నాటికి దేశ జనాభా 54.81 కోట్లకు పెరిగింది. 1991లో దేశ జనాభా 84.64 కోట్లు కాగా, రాష్ట్ర జనాభా 6.66 కోట్లు మాత్రమే. గత 20 ఏళ్లలో స్వల్పంగా రెండు కోట్ల జనాభా మాత్రమే పెరిగింది. రాష్ట్రంలో ఆదిలాబాద్ 27.37 లక్షలు, నిజామాబాద్ 25.52 లక్షలు, కరీంనగర్ 38.11 లక్షలు, మెదక్ 30.31 లక్షలు, హైదరాబాద్ 40.10 లక్షలు, రంగారెడ్డి 52.96 లక్షలు జనాభా నమోదైంది. మహబూబ్‌నగర్ 40.42 లక్షలు, నల్గొండ 34.83 లక్షలు, వరంగల్ 35.22 లక్షలు, ఖమ్మం 27.98 లక్షలు, శ్రీకాకుళం 26.99లక్షలు, విజయనగరం జిల్లా 23.42 లక్షలు, విశాఖపట్టణం 42.88లక్షలు, తూర్పుగోదావరి 51.51 లక్షలు, పశ్చిమగోదావరి 39.34 లక్షలు, కృష్ణ 45.29 లక్షలు, గుంటూరు 48.89 లక్షలు, ప్రకాశం 33.92 లక్షలు, నెల్లూరు జిల్లా 29.66 లక్షలు, కడప జిల్లా 28.84 లక్షలు, కర్నూలు జిల్లా 40.66 లక్షలు, అనంతపురం జిల్లా 40.83 లక్షలు, చిత్తూరు జిల్లా 41.70 లక్షలు జనాభా నమోదైంది.
తరగని పేదరికం
రాష్ట్రంలో ఉపాథి కల్పనకు, పేదరిక నిర్మూలనకు అనేక పథకాలను అమలుచేస్తున్నా నిరుపేదల సంఖ్య తగ్గడం లేదు.రాష్ట్ర జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుపేదేనని సామాజిక ఆర్ధిక సర్వే 2012-13లో ప్రభుత్వం పేర్కొంది. దేశ వ్యాప్తంగా 35.46 కోట్ల మంది నిరుపేదలు కాగా, మన రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య 1.76 లక్షల కోట్లు ఉందని సర్వే వివరించింది. 1973-74లో నిరుపేదలు 48.86 శాతం కాగా, అది 1977-78 నాటికి 39.31 శాతానికి, 1983 నాటికి 28.91 శాతానికి తగ్గింది. 1993-94లో నిరుపేదలు 22.19 శాతం కాగా, 2004-05లో 29.60 శాతం, 2009-10 నాటికి 21.10 శాతం నిరుపేదలున్నారని తేలింది. 1973-74లో నిరుపేదల సంఖ్య 2.25 కోట్లు కాగా, 1993-94 నాటికి నిరుపేదల సంఖ్య 1.53 కోట్లు ఉంది. టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం 2004-05 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు పెరిగింది.
* ప్రతి ఐదుగురిలో ఒకరు పేదవారే
english title:
state's population
Date:
Tuesday, March 19, 2013