విశాఖపట్నం, మార్చి 19: వేలల్లో ఫీజులు చెల్లిస్తే అనామక పాఠశాల తరపున పరీక్షలకు పంపితే ఊరుకునేది లేదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీతమ్మధారలోని నారాయణ ఇటెక్నో పాఠశాలలో 90 మంది విద్యార్థులు టెన్త్ చదువుతున్నారు. వేలాది రూపాయలు చెల్లించి పేరున్న స్కూల్‌లో చేర్పిస్తే చివరకు అడ్రస్‌లేని పాఠశాలల తరపున వీరని పరీక్షలకు పంపడంతో ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆగ్రహం రప్పించింది. దీంతో వీరంతా ఏకమై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. నారాయణ విద్యాసంస్థలు పట్టణంలో పలు పాఠశాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే సీతమ్మధార బ్రాంచ్ నుంచి 90 మంది విద్యార్థులు ఈనెల 22నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. అయితే ఈపాఠశాల నుంచి హాజరయ్యే వారిని నారాయణ సంస్థ నుంచి పరీక్షకు పంపకుండా వేరే పాఠశాల నుంచి పంపుతున్నట్టు హాల్ టికెట్లను చూసి తెలుసుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు మంగళవారం వచ్చారు. ఖర్చుకు వెనుకాడకుండా తమ పిల్లల్ని మీ సంస్థలో చేర్పించామని, ఇప్పుడు అనుమతి లేదంటూ వేరే పాఠశాల తరపున పరీక్షలకు పంపడం ఎంతవరకూ సమంజసం అంటూ నిలదీశారు. అయితే ఇప్పటికే హాల్ టికెట్లు జారీ కావడంతో చేసేదేమీ లేందంటూ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు, డిఇఓకు ఫిర్యాదు చేశారు.
వేలల్లో ఫీజులు చెల్లిస్తే అనామక పాఠశాల తరపున పరీక్షలకు పంపితే
english title:
hall tickets
Date:
Wednesday, March 20, 2013