విజయనగరం, మార్చి 19 : రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సత్ఫలితాలిస్తున్నాయని, వాటిని మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియోకానె్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలోవ ఇప్పటి వరకు 7,742 గ్రామాలలో సదస్సులు జరిగాయని, 4,264 గ్రామాలలో విఆర్‌ఓ కార్యాలయాలకు ప్రభు భవనాలు సమకూర్చటం జరిగిందన్నారు. ప్రభుత్వ భవనాలు కేటాయించే సందర్భంలో భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా కలక్టర్లు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. కాగా సదస్సుల్లో 1,58,800 దరఖాస్తులు అందాయని వాటిలోవ 54 వేలకుపైగా అక్కడికక్కడే పరిష్కరించటం జరిగిందన్నారు. మిగిలినవి 90 రోజుల్లో పరిష్కరించాలని, తిరస్కరించిన దరఖాస్తులను ఏకారణంతో తిరస్కరించినది తగు కారణం చూపాలని మంత్రి ఆదేశించారు. అందిన ఫిర్యాదుల మేరకు భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రతీ రెవెన్యూ సదస్సులో భూముల వివరాలను కలర్ మేప్‌లో గుర్తించి ప్రకటించాలన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో 1551 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిణకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇప్పటి వరకు 450 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని, 175 గ్రామాలలో విఆర్‌ఓ కార్యాలయాలకు ప్రభుత్వ వసతి కల్పించటం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 50కిపైగా సదస్సుల్లో కలక్టర్, సంయుక్త కలక్టర్, ఆర్డీఓలు, ప్రత్యేక ఉప కలక్టర్లు, జిల్లా అధికారులు స్వయంగా పాల్గొనటం జరిగిందన్నారు. సమావేశంలో జెసి శోభ, ప్రత్యేక ఉప కలక్టర్ శ్రీలత, డి.సత్యనారాయణ, ఆర్టీఓలు రాజకుమారి, వెంకటరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సత్ఫలితాలిస్తున్నాయని
english title:
raghuveera
Date:
Wednesday, March 20, 2013