విజయనగరం, మార్చి 19 : గర్భదారణ, జన్యుహంబంధమైన గర్భస్థ పించానికి సంబంధించి వ్యాధుల పరీక్షలకే ఆల్ట్రాసౌండ్, స్కానింగ్ పద్దతిని ఉపయోగించాలని, గర్భస్థ లింగనిర్ధారణ, పరీక్షలు అనుమతించబడవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.స్వరాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె సమావేశ మందిరంలో పిసిపిఎన్‌డిటి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భధారణ పర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ లింగ ఎంపిక నిషేధ చట్టం ప్రకారం స్కానింగ్ సంస్థలు తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వద్ద ఈ నమోదు చేసుకోవాలని,నమోదు చేసుకోని సంస్థలు ఎలాంటి పరీక్షలు నిర్వహించినా పిసిపిఎన్‌టిడి చట్టం ప్రకారం నేరమని, అలాంటి సంస్థలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌పిహెచ్‌ఓలు వారి పరిధిలోనున్న నమోదు చేసుకొని సంస్థల వివరాలను అందజేయాలని సూచించారు. నమోదు చేసుకున్న కేంద్రాల్లో పనిచేస్తున్న నమోదు సిబ్బంది పూర్తి స్థాయి అర్హత అనుభవం కలిగి వుండాలని, నిర్ధేశిత ప్రమాణాలు, యంత్రాలు, సౌకర్యాలు కలిగి వుండాలని తెలిపారు.గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అందుకు ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆశకార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో సభ్యులు ఐసిడిఎస్ పిడి రాబర్ట్స్, డిసిహెచ్‌ఎహ్ విజయలక్ష్మి, సంఘ సేవకులు బుచ్చిబాబు, సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నహైందవి, ఎస్‌పిహెచ్‌ఓలు,డిప్యూటీ డిఎంహెచ్‌ఓలు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
సాంకేతిక లోపంతో ఆగిన గూడ్స్ రైలు
శృంగవరపుకోట, మార్చి 19 : పట్టణంలోని ఎస్.కోట శివారులో కిరండోల్ నుండి విశాఖ ఇనుప ముడిసరుకుతో వెళ్తున్న గూడ్స్ రైలు సాంకేతిక లోపం కారణంగా ఎస్‌కోట రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. స్టేషన్ మాస్టర్ దేముడు చెప్పిన వావరాలు ఇలా ఉన్నాయి. కిరండోల్ నుంచి వస్తున్న మూడు ఇంజన్లు గల గూడ్స్ రైలు ఎస్‌కోట స్టేషన్ వద్దకు రాగానే సాంకేతిక లోపంతో ఇంజన్‌నుంచి చెలరేగాయి. వెంటనే ఇంజన్ డ్రైవర్‌కు సమాచారం అందించిన రైలును నిలిపింవేయించి ఎస్‌కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో నాలుగు గంటల పాటు గూడ్స్‌రైలు నిలిచిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.