విజయనగరం , మార్చి 19: జిల్లా పోలీస్ శాఖలో ఆర్మ్‌డ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.సన్యాసిరావు ప్రత్యేక శిక్షణ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి పోలీస్ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. హైదరాబాద్‌లో ఇంటిలిజెన్స్ సెక్యూర్టీ విభాగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు సన్యాసరావు రాష్ట్ర పోలీస్ శాఖ బంగారు పతకాన్ని అందజేసింది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు పతకాన్ని సన్యాసిరావుకి అందజేసి అభినందించారు. ఆర్మ్‌డ్ డిఎస్పీ బి.రామకృష్ణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పారావు, పాల్గొన్నారు.
756 మంది మహిళా కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక
విజయనగరం , మార్చి 19: మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలో 756 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జిల్లా పోలీస్ మైదానంలో నిర్వహించిన 2.5 కిలోమీటర్ల పరుగు పోటీలో 863 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 756 మంది అభ్యర్థులు తదుపరి నిర్వహించేశరీర దారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎంపికల్లో పరుగు పోటీల్లో పాల్గొనే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాటు చేశారు. ఈ పరుగు పోటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 26న నిర్వహించే శరీర దారుఢ్య పరీక్షలకు అవసరమయ్యే హాల్‌టికెట్లను జారీ చేశారు. ఆర్మ్‌డ్ ఇన్‌స్పెక్టర్లు అప్పారావు, నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.