విజయనగరం, మార్చి 20: కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి వి.కిషోర్‌చంద్రదేవ్ ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి రాత్రికి కురుపాం చేరుకుంటారు. 24న ఉదయం 9 గంటలకు కురపాంలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 10.15 గంటలకు పార్వతీపురం చేరుకొని అక్కడ మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభిస్తారు. డ్వాక్రా గ్రూపులతో సమావేశమవుతారు. మధ్యాహ్నానికి కురపాం చేరుకుంటారు. 25న ఉదయం 9 గంటలకు బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారని డిపిఆర్‌ఒ ఒక ప్రకటనలో తెలిపారు.
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
పాచిపెంట, మార్చి 20: బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపాన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన కర్రి రాములమ్మ (70) మృతి చెందింది.
కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్‌శాఖ
english title:
d
Date:
Thursday, March 21, 2013