Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గార్లఒడ్డు గుట్టల్లోకి మావోల ప్రవేశం

$
0
0

ఏన్కూరు, మార్చి 23: మండల పరిధిలోని గార్లఒడ్డు గుట్టల్లోకి శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో మండలంలో కలకలంరేపింది. కొత్తగూడెం ఓఎస్‌డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వివరాలిలావున్నాయి. భద్రాచలం నుండి ఖమ్మంకు మావోయిస్టు నేత తరలివెళ్తున్నారన్న సమాచారం అందడంతో వైరా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అప్రమత్తమై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో ఒరిస్సా రిజిస్ట్రేషన్‌తో ఉన్న బొలేరో వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని ఆపారు. వెంటనే ఓ వ్యక్తి వాహనం నుండి దూకి పరారయ్యాడు. మిగిలిన వారు సదరు వాహనాన్ని తీసుకుని తల్లాడ మీదుగా ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు సమీపంలోని గుట్టల్లోకి ప్రవేశించారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఖమ్మం ఎఎస్పీ ఇక్భాల్, కొత్తగూడెం ఎఎస్పీ భాస్కర్‌భూషణ్, ఖమ్మం, వైరా డిఎస్పీలు సునీతారెడ్డి, సత్తిబాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ నిర్వహించారు. ఈక్రమంలో వారికి మావోయిస్టులు వదిలివెళ్ళిన వాహనం కనిపించింది. దానిలో ఏమైనా ఆయుధాలు ఉన్నాయేమోనని పరిశీలించి ఏమిలేకపోవడంతో వాహనాన్ని ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గుట్టల ప్రాంతంలో మావోయిస్టుల జాడ కనిపించకపోవడంతో కూంబింగ్‌లో భాగంగా పోలీసులు సమీపంలోని జన్నారం, టిఎల్‌పేట, లచ్చగూడెం, శ్రీరామగిరి, రాఘవాపురం గ్రామాల్లో ఎక్కడైనా మావోయిస్టులు తలదాచుకున్నారేమోనని అనుమానంతో గ్రామంలో గాలింపులు చేపట్టారు. దీంతో పాటు జన్నారం నుండి ఖమ్మం వెళ్ళే రహదారి, ఏన్కూరు నుండి తిమ్మరావుపేటగా మీదుగా ఖమ్మం వెళ్ళే రహదారికి సైతం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. మావోయిస్టుల జాడ ఎక్కడా కనిపించకపోవడంతో కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మావోయిస్టులు వాహనాన్ని వదిలివెళ్ళిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రంగనాథ్ మధ్యాహ్న సమయంలో ఆప్రాంతం గుండా వాహనం దిగకుండానే ప్రదేశాన్ని పరిశీలించివెళ్ళారు. మండలంలో ఎన్నడూలేని విధంగా మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గార్లఒడ్డు సమీపంలో గుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి సమీప ప్రాంతాల్లోని రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి భయపడ్డారు.

తప్పించుకున్న మావోలను తప్పక పట్టుకుంటాం
* ఎస్పీ రంగనాథ్
వైరా, మార్చి 23: తప్పించుకున్న మావోయిస్టులను పటుకుని తీరుతామని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. మావోయిస్టు అగ్రనేతలు శుక్రవారం అర్ధరాత్రి తప్పించుకున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పించుకున్న మావోయిస్టుల వివరాలను స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారని తెలిపారు. వారి పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అనంతరం అధికారులు తప్పించుకున్న అగ్రనేత ఫోటోను విడుదల చేశారు. తప్పించుకున్న వ్యక్తి మావోయిస్టు అగ్రనేతలలో ఒకరిగా భావిస్తున్నామని వివరించారు. అతనిపై అతిపెద్ద రివార్డు ఉందని, మావోయిస్టులు ఎట్టి పరిస్థుతలలోను తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఎంతో కాలం చట్టం కళ్ళు కప్పి తిరగలేరని త్వరలలోనే వారి గుట్టు విప్పుతామన్నారు. వాహనాల తనిఖీలలో జరిగిన అవగాహన లోపం వలననే తప్పిదం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైరా డిఎస్పీ సత్తిబాబు, ఏస్‌ఐ గోపి ఉన్నారు.

పోలీసులకు చిక్కిన మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ ?
* జిల్లాలో కలకలం : కోర్టులో హాజరుపరచాలని ఎన్‌డి డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 23: ఆంధ్రా, ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దులోని మావోయిస్టు ఎఓబి ఇన్‌చార్జి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన కటకం సుదర్శన్ ఎలియాస్ రణధీర్‌ను శనివారం ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి భద్రాచలం నుండి హైదరాబాద్‌కు ఖమ్మం మీదుగా వెళ్ళేందుకు బోలేరో వాహనంలో ప్రయాణిస్తుండగా వైరా ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించటంతో వాహనాన్ని వదిలి సుదర్శన్ మరో ఇరువురు నక్షలైట్లు పారిపోయారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత ప్రజలకు సుదర్శన్ తారసపడటంతో గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఆగ్రహించి రాళ్ళు విసరటంతో ఇరువురు గ్రామస్థులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంబడించిన పోలీసులకు గ్రామస్థుల సహకారంతో సుదర్శన్ పట్టుబడ్డాడని సమాచారం. అగ్రనేతగా వున్న సుదర్శన్ మల్కజ్‌గిరి సంఘటలో కీలకపాత్రధారి కావటంతో మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యాసంఘటనలో ప్రధాన నిందితుడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన హత్యాప్రయత్న సంఘటనలో సైతం ప్రధాన నిందితుడు. 40కిపైగా కేసులుఉన్న ఆయనపై రూ. 20 లక్షల రివార్డు వుంది. పారిపోయే క్రమంలో కాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. ఖమ్మం పోలీసుల అదుపులో వున్న సుదర్శన్‌ను ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంఘటన నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశారు. సుదర్శన్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఇరువురు నక్షలైట్లు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసుల అదుపులో వున్న సుదర్శన్‌ను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌లో సమయాన్ని వృథా చేశారు
* ఎంపి నామ అసంతృప్తి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 23: అనేక సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన పార్లమెంట్ సమావేశాల్లో సమయాన్ని వృథా చేశారని ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వ్యక్తిగత దుషణలకు పాల్పడటంతో సజావుగా సాగాల్సిన సమావేశాలు ప్రజలకు ఉపయోగపడకుండా అయ్యాయన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులు అనుసరించిన విధానాల వల్ల పార్లమెంట్ హుందాతనాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 672అభివృద్ధి పనులు పూర్తి చేశామని, అందుకోసం 816కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని నామ తెలిపారు. మరో 312కోట్లతో 158అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నందున ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాదనను అదనంగా పెంచటంతో పాటు దానిని అదే రాష్ట్రాల్లో వినియోగించే విధంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొనిరావాలని తాను పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేసినట్లు నామ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యను నివారించేందుకు యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైతే వాటర్ ట్యాంక్‌ల ద్వారా ప్రజలకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 8 వాటర్ ప్లాంట్లను మంజూరు చేయటం జరిగిందన్నారు. పంట పొలాలకు సాగరు నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అవి విడుదల కాకపోవటంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నామ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అరకొరగా ఇస్తున్న విద్యుత్ వల్ల పంటపొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అదే క్రమంలో రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఉదయం వేళల్లో వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దినేని స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

మణుగూరులో వైకాపా నేత పాయంకు ఘన స్వాగతం
మణుగూరు, మార్చి 23: వైఎస్సార్ సిపి నేత పాయం వెంకటేశ్వర్లుకు మణుగూరులో శనివారం ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్ సిపిలో చేరిన అనంతరం తొలిసారిగా మణుగూరుకు వచ్చిన పాయం దంపతులకు మణుగూరు, పినపాక, అశ్వాపురం మండలాల వైకాపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సౌమ్యుడిగా పేరున్న పాయం గతంలో సిపిఐ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన జగన్‌ను కలసి పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో ఆ పార్టీలో నూతనోత్సాహం కన్పించింది. భారీ కాన్వాయ్‌తో బూర్గంపాడు మండలం నుంచి పినపాక వరకు స్వాగతం లభించింది. పట్టణంలోని ప్రజలకు అభివాదం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ జి బొలేరో వాహనం స్వాధీనం
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>