పెనుగొండ, మార్చి 24: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం పెనుగొండ మండలం నడిపూడి శివారు మిద్దేవారిపాలెంలో రూ.82.50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. మంచిని గుర్తించి, అభివృద్ధిని అభినందించాలన్నారు. రూ.లక్ష వరకు రైతులకు వడ్డీలేని రుణాలు అందించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. జలవిద్యుత్ కేంద్రాలు అగిపోవడం వల్ల కరెంటుకోత ఎక్కువగా ఉందని, ఉత్పత్తి అగినా కరెంటు వినియోగం మాత్రం తగ్గలేదన్నారు. మిద్దేవారిపాలెం ట్రాక్టర్లు కూడా తిరిగే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కట్టవారిపాలెంలో బ్రిడ్జి మంజూరుకు ప్రయత్నం చేస్తానన్నారు. అదేవిధంగా చిన్నవారిపాలెం, మదనవారిపాలెంలకు కూడా వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పెనుగొండ, ఆచంట ఎఎంసి ఛైర్మన్లు నరసరెడ్డి, ఆనందప్రకాష్, కేత సత్తిబాబు, మేకా వెంకటరామకృష్ణ, తహసీల్దార్ జిజెఎస్ కుమార్, కడలి రామానాగ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి పితాని
english title:
public welfare
Date:
Monday, March 25, 2013